RAAKA Title: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘రాకా’ (RAAKA) చిత్రం అనౌన్స్‌మెంట్ నుండే భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే, తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాల్సింది పోయి, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read also-ఏప్రిల్ 15న డోంట్ మిస్.. బుర్ర పాడు చేసే మలయాళం మూవీ.. ఏ ఓటీటీలో అంటే?
సాధారణంగా భారీ చిత్రాల టైటిల్స్ వెనుక ఏదో ఒక గంభీరమైన అర్థం ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తారు. కానీ ‘రాకా’ విషయంలో నెటిజన్లు చేస్తున్న డీకోడింగ్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ టైటిల్‌లోని అక్షరాలను విడదీసి నెటిజన్లు ఇలా విశ్లేషిస్తున్నారు.
R: అల్లు రామలింగయ్య (అల్లు అర్జున్ తాతగారు)
AA: అల్లు అర్జున్ (హీరో)
K: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్ అధినేత, నిర్మాత)
A: అట్లీ (దర్శకుడు)
ఈ రకంగా సినిమాకు సంబంధం ఉన్న వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాలను కలిపి ‘రాకా’ అని పెట్టారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “ఇది టైటిల్ లా లేదు, ఏదో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ పేరులా ఉంది” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ నుండి ఇంత సింపుల్ టైటిల్ రావడంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం టైటిల్ మాత్రమే కాకుండా, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికైన సాయి అభ్యంకర్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అట్లీ గత చిత్రాలకు ఏఆర్ రెహమాన్ లేదా అనిరుధ్ వంటి దిగ్గజాలు సంగీతం అందించారు. కానీ అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాకు, కేవలం ఒకట్రెండు వైరల్ సాంగ్స్ (కడల్ నదిలాంటివి) చేసిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకోవడం రిస్క్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పోస్టర్ లాంచ్ సమయంలో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇంప్రెసివ్‌గా లేదనే వాదన వినిపిస్తోంది.
Read also-ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఎలా ఉందంటే.. ఫుల్ రివ్యూ..
ఏదైనా పెద్ద సినిమా అనౌన్స్ అయినప్పుడు ఇలాంటి నెగటివ్ కామెంట్స్ రావడం సహజమే. అయితే ‘రాకా’ చిత్ర బృందం మాత్రం ఈ ట్రోల్స్‌పై ఇంకా అధికారికంగా స్పందించలేదు. అట్లీ సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి, ఈ ‘రాకా’ అనే పేరు వెనుక బలమైన కథా నేపథ్యం ఉండే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరగనుంది. ఇలాంటి తరుణంలో అట్లీతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద వస్తున్న ట్రోల్స్ సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయా లేక టీజర్, ట్రైలర్లతో ఈ విమర్శలకు చెక్ పెడతారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ ‘డీకోడింగ్’ గోల మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.