E-Paper
Advertisement

ఏప్రిల్ 15న డోంట్ మిస్.. బుర్ర పాడు చేసే మలయాళం మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

ఏప్రిల్ 15న డోంట్ మిస్.. బుర్ర పాడు చేసే మలయాళం మూవీ.. ఏ ఓటీటీలో అంటే?
Advertisement

OTT Movie: ఈ మధ్యకాలంలో ఓటీటీ ఆదరణ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అటు ఓటీటీ సంస్థలు కూడా ఆడియన్స్ కు మంచి వినోదాన్ని అందించడానికి భిన్న విభిన్నమైన జానర్లలో సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సైకలాజికల్ , థ్రిల్లర్, యాక్షన్, హారర్ , ఫ్యామిలీ ఇలా ఒక్కటేమిటి ప్రేక్షకుడికి కావలసిన ప్రతి జానర్ సినిమా ఇక్కడ లభిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక మలయాళం మూవీ థియేటర్లలో గత నెల విడుదలై సంచలన విజయం అందుకొని.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. అదేదో కాదు ‘సంభవం అధ్యయనం ఒన్ను’..

డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మిస్టరీ థ్రిల్లర్ టైమ్ లూప్ మూవీ!

మిస్టరీ థ్రిల్లర్ టైమ్ లూప్ కథాంశం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి జిత్తు సతీషన్ మంగళతు దర్శకత్వం వహించారు. వినీత్ కుమార్, అస్కర్ అలీ, సిద్ధార్థ భరతన్, సెంథిల్ కృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్ స్టార్ వేదికగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు అలాగే ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.. ముఖ్యంగా డిఫరెంట్ జానర్ లో సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా ఒక మంచి థ్రిల్లింగ్ టాపిక్ అనడంలో సందేహం లేదు.

Advertisement

ALSO READ:డైరెక్టర్ పై చేయి చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ.. ఎందుకంటే?

‘సంభవం అధ్యయనం ఒన్ను’.. స్టోరీ..

మరి ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళ తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఒక కారడవిలోకి వెళ్లిన వారెవరు కూడా తిరిగి వచ్చిన సందర్భాలు లేవు అనే ఒక వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంటుంది . అలాంటిది ఒకరోజు తమిళనాడు పోలీస్ ఆఫీసర్ ఆ అడవిలోకి వెళ్లి మళ్లీ కనిపించకుండా పోతాడు. ఈ విషయం తెలుసుకున్న కేరళ పోలీసులు ఆయనను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. అక్కడ వారికి తమిళ పోలీసు ఆచూకీ లభించకపోగా.. వింత వింత పరిస్థితులు , అనుభవాలు ఎదురవుతాయి. అంతే కాదు టైం కూడా సరిగ్గా ముందుకు నడవదు . జరిగిన ఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లు వారికి అనిపిస్తూ ఉంటుంది. దీంతో ఆ పోలీస్ ను వెతకడం పక్కనపెట్టి.. తమను తాము రక్షించుకోవడానికి అక్కడి నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అవేవీ సఫలం కావు. ప్రారంభించిన దగ్గరికే మళ్లీ తిరిగి వస్తుంటారు . చివరికి అక్కడ ఒక అదృశ్య శక్తి ఏదో ఉందని వాళ్ళు గుర్తిస్తారు. ఇక ఆ తర్వాత వాళ్లు ఆ అడవి నుంచి బయట పడగలిగారా? ఈ బయటపడే సమయంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇలా ప్రతి విషయాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు డైరెక్టర్ . ముఖ్యంగా సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా అనుక్షణం మిస్టరీ సస్పెన్స్ తో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది ఈ సినిమా. ప్రేక్షకులను కచ్చితంగా సినిమాలో లీనమయ్యేలా చేస్తోంది. అలాంటిది ఇప్పుడు మీ ఇంట్లోనే కుటుంబంతో కలిసి చూసే అవకాశం లభిస్తోంది కాబట్టి ఏప్రిల్ 15వ తేదీన ఈ సినిమాను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అంటూ థియేటర్లో చూసిన ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×