Bathroom Door Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం మాత్రమే కాదు.. అది సానుకూల శక్తుల నిలయం. అయితే మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా బాత్‌రూమ్ విషయంలో చాలా మంది అశ్రద్ధ వహిస్తుంటారు. బాత్ రూం తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించి, అనారోగ్యం, ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం బాత్‌రూమ్.. అనేది ఇంటిలో ‘రాహువు’ ప్రభావం ఉండే ప్రదేశం. ఇక్కడ నీటి వాడకం ఎక్కువగా ఉండటం వల్ల తేమతో పాటు కొన్ని రకాల ప్రతికూల ప్రకంపనలు విడుదలవుతాయి.
1. నెగటివ్ ఎనర్జీ వ్యాప్తిని అడ్డుకోవడం:
బాత్‌రూమ్, టాయిలెట్లలో సహజంగానే ప్రతికూల శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఒకవేళ మీరు తలుపులు తెరిచి ఉంచితే.. ఆ ప్రతికూల శక్తి హాల్, బెడ్‌రూమ్ , వంటగదిలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల ఇంట్లో ఉన్న వారికి మానసిక ప్రశాంతత కరువవుతుంది.
2. ఆర్థిక సమస్యలకు చెక్:
వాస్తు ప్రకారం.. బాత్‌రూమ్ తలుపులు తెరిచి ఉంచడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం తగ్గుతుందని అంటారు. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం, ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవకపోవడం వంటి సమస్యలు ఎదురైతే.. మీ ఇంటి బాత్‌రూమ్ తలుపుల వైపు ఒకసారి చూడండి. గాలిలో కలిసిపోయే ప్రతికూల శక్తి మీ ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటుంది.
3. ఆరోగ్యమే మహాభాగ్యం:
సైంటిఫిక్‌గా చూసినా.. వాస్తు పరంగా చూసినా బాత్‌రూమ్ నుంచి వచ్చే బ్యాక్టీరియా , క్రిములు ఇతర గదులకు చేరడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాస్తు ప్రకారం.. బాత్‌రూమ్‌లోని అశుద్ధ గాలి ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇది ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Also Read: రుద్రాక్షను ఎందుకు ధరించాలి? సైన్స్, పురాణాలు ఏం చెబుతున్నాయి?
బాత్‌రూం వాస్తులో ముఖ్యమైన జాగ్రత్తలు:
కేవలం తలుపులు మూయడమే కాకుండా మరికొన్ని నియమాలు పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
సాల్ట్ థెరపీ: ఒక గాజు గిన్నెలో కల్లు ఉప్పు పోసి బాత్‌రూమ్‌లో ఒక మూలన ఉంచండి. ఇది అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. ప్రతి వారం ఈ ఉప్పును మార్చాలి.
లీకేజీలు ఉండకూడదు: బాత్‌రూమ్ టాప్‌లు లీక్ అవుతూ నీళ్లు కారుతుంటే అది ఆర్థిక నష్టానికి సంకేతం. వెంటనే వాటిని రిపేర్ చేయించండి.
పరిశుభ్రత: వారానికి కనీసం రెండు సార్లు బాత్‌రూమ్‌ను శుభ్రం చేయాలి. మురికిగా ఉన్న బాత్‌రూమ్ దోషాలను పెంచుతుంది.
అద్దం దిశ: బాత్‌రూమ్‌లో అద్దం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉన్న గోడకు ఉండేలా చూసుకోండి.
మనం నివసించే ఇల్లు మనకు శక్తినివ్వాలి కానీ.. మన శక్తిని హరించకూడదు. అందుకే బాత్‌రూమ్ తలుపులను ఎప్పుడూ మూసి ఉంచడం అలవాటు చేసుకోండి. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా.. మీ ఇంట్లో ప్రశాంతతను , ఐశ్వర్యాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. “తలుపు మూయండి – అదృష్టాన్ని ఆహ్వానించండి” అనే సూత్రాన్ని పాటిస్తే సరి.