E-Paper
Advertisement

కొత్త ఇంటికి శ్రీకారం చుట్టిన బన్నీ.. మేనమామ చిరంజీవి ఇంటికి సమీపంలో.. ఎన్ని కోట్లంటే?

కొత్త ఇంటికి శ్రీకారం చుట్టిన బన్నీ.. మేనమామ చిరంజీవి ఇంటికి సమీపంలో.. ఎన్ని కోట్లంటే?
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అట్లీ(Atlee ) దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో షూటింగుకి ఇబ్బంది అవుతున్న కారణంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ముంబైకి షిఫ్ట్ కాబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై అల్లు అరవింద్ మాట్లాడుతూ..” షూటింగ్ కోసం ముంబైలో ఎక్కువగా ఉంటున్నందున అలా అనిపించి ఉండవచ్చు.. బన్నీకి ఇక్కడే సొంత ఇల్లు ఉంది.. పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు.. స్నేహితులు, ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లోనే ఉన్నారు. అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తాడు? అక్కడే స్థిరపడే ఆలోచన ఎందుకు చేస్తాడు? అలాంటిదేమీ లేదు” అంటూ ఆయన స్పష్టం చేశారు.

ముంబై కి షిఫ్ట్ కావడం లేదు కానీ.. నెల అద్దె తెలిస్తే గుండె గుబేల్

అల్లు అర్జున్ ముంబైలో సెటిల్ కాకపోయినప్పటికీ.. తన సినిమా షూటింగ్ ల నిమిత్తం దాదాపు రెండు నుండి మూడు సంవత్సరాలు అక్కడే ఉండబోతున్నారట. ఈ విషయం మాత్రం నిజం. అందుకే కొత్త ఇల్లు నిర్మించుకోకుండా అక్కడ అద్దెకు తీసుకోవాలని బన్నీ సంవత్సరం క్రితమే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది . ముఖ్యంగా ముంబైలోని జూహు ఏరియాలో తార రోడ్డులో 5BHK లగ్జరీ అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకున్నారు. ఏడాది క్రితమే డీల్ ఫిక్స్ అయ్యింది. అటు అల్లు అర్జున్ – స్నేహ కూడా తమ అభిరుచికి తగ్గట్టుగా ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేయించుకున్నారట. సముద్రానికి ఎదురుగా ఉండే ఈ అపార్ట్మెంట్ నెలవారీ అద్దె ఏకంగా 16 లక్షలు.. మూడేళ్లపాటు అక్కడే ఉండబోతున్నాడని.. స్కూల్ సెలవులు ఇచ్చిన సమయంలో భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలు అయాన్ , అర్హ కూడా అక్కడికి వెళ్తారని సమాచారం. 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మేనమామ చిరంజీవి ఇంటికి సమీపంలో బ్లెస్సింగ్స్ పేరిట కొత్త ఇల్లు..

Advertisement

ఇకపోతే ఈ అద్దె ఇల్లు కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు హైదరాబాదులోనే మరో కొత్త ఇంటి నిర్మాణానికి బన్నీ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో అత్యంత విలాసవంతమైన ఇంటిని బన్నీ నిర్మిస్తున్నారు. తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నివాసానికి సమీపంలో సుమారు 4వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు.సుమారుగా రూ.80 కోట్ల నుండీ రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ భవనం చాలా అందంగా, హుందాగా రూపుదిద్దుకుంటుంది. విదేశీ మార్బుల్స్, అత్యాధునిక ఇంటీరియర్స్ తో నిర్మిస్తున్న ఈ ఇంద్ర భవనంలో సకల సౌకర్యాలు ఉండబోతున్నాయట. పైగా ఈ ఏడాది చివర్లో బన్నీ తన కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇల్లు మాత్రమే కాదు ఆఫీస్ కూడా..

ఇకపోతే ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు ఇందులో అల్లు అర్జున్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఇళ్లల్లో ఒకటిగా.. అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. ఈ నివాసానికి దివంగత నటులు కృష్ణంరాజు నివాసంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ కూడా సమీపంలోనే ఉన్నాయి. ఈ ఇంటికి “బ్లెస్సింగ్స్” అని నామకరణం చేశారు. ఏదేమైనా ఇక్కడ కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిని నిర్మిస్తూనే.. అక్కడ నెలకు లక్షల్లో అద్దె చెల్లిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు అల్లు అర్జున్.

Advertisement

ALSO READ:చిరంజీవిని ఢీ కొట్టబోతున్న డస్కీ బ్యూటీ!

అల్లు అర్జున్ సినిమాలు..

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు ముంబైలోనే ఉండనుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా జాన్వీ కపూర్ , మృనాల్ ఠాకూర్ , రష్మిక మందన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజుతో చేయబోయే సినిమా కూడా ముంబైలోనే షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×