E-Paper
Advertisement

విజయ్ బాటలో అల్లు అర్జున్ ..సీయం అవుతాడా ?

విజయ్ బాటలో అల్లు అర్జున్ ..సీయం అవుతాడా ?
Advertisement

Allu Politics : సినిమా స్టార్స్ రాజకీయాలని ఏలడం కొత్తేమీ కాదు.లేటెస్ట్ గా కోలీవుడ్ దళపతి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.అయితే ఇప్పుడు బన్నీ కూడా విజయ్ బాటలోనే నడిచే అవకాశం ఉందా ..మరికొద్ది రోజుల్లో ఇలాంటి పొలిటికల్ సెన్సేషన్ apలోనూ రిపీట్ కాబోతోందా? పుష్పరాజ్ అంటూ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేస్తున్న అల్లు అర్జున్ ఫ్యూచర్ లో ఏపీ సీఎం అయ్యేందుకు అడుగులు వేస్తున్నాడా అంటే ‘ఔననే’ సమాధానం వినిపిస్తోంది.

విజయ్ రూట్ లోనే బన్నీ 

Advertisement

విజయ్ కి తమిళ నాట ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్ పీక్స్ లో ఉన్నప్పుడే పాలిటిక్స్ లోకి ఇచ్చాడు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా సరిగ్గా అదే బాటలో ఉన్నట్టు కనిపిస్తుంది. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, ‘పుష్ప’తో పాన్ ఇండియా లెవల్లో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్లు అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి వారితో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియా అంతటా తిరుగులేని క్రేజ్ ని సొంతం చేసుకునే పనిలో పడ్డాడు.

also read :ప్యాన్ ఇండియా స్టార్ ప్లాన్ రివర్స్ అయితే? కల్కి, స్పిరిట్ మధ్య నలిగిపోతున్న ప్రభాస్!

Advertisement

మెగా కాంపౌండ్ నుంచి బయటికి.. 

ఒకప్పుడు బన్నీ అంటే మెగా కాంపౌండ్ లో ఒక హీరో మాత్రమే.కాని ఇపుడు రేంజ్ మారింది.రీసెంట్ గా వచ్చిన పుష్ప సిరీస్ తో తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ అయింది.అయితే గత కొద్దికాలంగా మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ap ఎలక్షన్స్ టైం లో బన్నీడైరెక్ట్ గానే ycp కి సపోర్ట్ చేయడం మెగా క్యాంప్ లో మంటలు రేపింది.మరో పక్క వాటికి తోడు రీసెంట్‌గా తన ఫ్యాన్స్ అసోసియేషన్లతో పెట్టిన సీక్రెట్ మీటింగులు చూస్తుంటే..బన్నీ కేవలం సినిమాలకే పరిమితం కావాలని అనుకోవడం లేదన్న క్లారిటీ వస్తుంది.
ఇక బన్నీ గతంలో “నాకు నచ్చిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తా.. ఎవరికైనా సపోర్ట్ చేస్తా” అన్నమాటలని అనాలసిస్ చేస్తే ఆ మాటల వెనుక పెద్ద స్కెచ్చే ఉందని భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ .

 పొలిటికల్ వార్

ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీయం గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు.దీంతో బన్నీ కూడా తన స్టామినా చూపించుకోవడానికి అల్లు అర్జున్ తన ‘అల్లు ఆర్మీ’ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నాడని అందులో భాగంగానే మీటింగులు ఏర్పాటు చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.ఈ వరుస పరిణామాలు అన్నీ చూస్తుంటే రేపు పొద్దున్న విజయ్ లాగే బన్నీ కూడా ఒక సొంత పార్టీ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ఒక వర్గం ఓట్లను ప్రభావితం చేస్తుంటే, బన్నీ తనకున్న గ్లోబల్ ఇమేజ్ మరియు యూత్ ఫాలోయింగ్‌తో ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

సీయం అల్లు అర్జున్ 

అట్లీ ,లోకేష్ కనగరాజ్ సినిమాలతో తమిళనాడులో పాగా వేయడం ఖాయం.ఇక అల్లు అరవింద్ వంటి వ్యక్తీ వెనకుండి నడిపిస్తుంటే, బన్నీ తన క్రేజ్‌తో జనాల్లోకి వెళ్తే.. ఫ్యూచర్ లో ఆంద్రలో “సీయం అల్లు అర్జున్ ” అనే స్లోగన్ వినిపించినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి మెగా బ్రాండ్ నుంచి బయటికి వచ్చి, సొంతంగా ‘అల్లు బ్రాండ్’తో పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ చేసే దిశగా పడుతున్న బన్నీ అడుగులు ఎలాంటి సంచలననాలకి దారి తీస్తాయో !

also read :సినిమా రీల్ నుంచి రియల్ పాలిటిక్స్ వరకు.. విజయ్-త్రిష అన్స్టాపబుల్ కెమిస్ట్రీ

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×