E-Paper
Advertisement

AAFA ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్ డ్రైవ్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్!

AAFA ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్ డ్రైవ్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్!
Advertisement

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అల్లు అర్జున్ (Allu Arjun )ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా నటుడిగా కొనసాగుతున్న అల్లు అర్జున్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు.. అయితే ఈ ఏడాది వినూత్నంగా అల్లు అర్జున్ అభిమానులు చేపట్టిన కార్యక్రమం పట్ల ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన..

అల్లు అర్జున్ తన పుట్టినరోజు పురస్కరించుకొని మళ్లీ పుట్టినరోజు వరకు ప్రతి ఏడాది ఒక మంచి సామాజిక అంశాన్ని ప్రోత్సహించాలని అభిమానులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు హెచ్ పీవీ వ్యాక్సిన్(HPV Vaccine) గురించి ప్రచారం చేస్తూ క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.. ఇటీవల కాలంలో సర్వైకల్ క్యాన్సర్స్ అధికమవుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సర్వైకల్ క్యాన్సర్ అరికట్టడం కోసం హెచ్ పి వి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ వ్యాక్సిన్ 14 సంవత్సరాలు వయసున్న ప్రతి ఒక్క అమ్మాయి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. అయితే కొంతమంది ఈ వ్యాక్సిన్ పట్ల అపోహలు కలిగి ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ తొలగిస్తూ బన్నీ అభిమానులు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

నా హృదయం ఆనందంతో నిండిపోతుంది..

Advertisement

ఇలా బన్నీ అభిమానులు HPV వ్యాక్సిన్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడంతో ఈ విషయంపై అల్లు అర్జున్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రతి ఏడాది ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి హెచ్ పి వి వ్యాక్సిన్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన నా అభిమానులందరిని చూసి చాలా గర్వపడుతున్నాను. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నా హృదయం  ఆనందంతో నిండిపోతుంది. మీ శక్తి అంతా ఇలాంటి మంచి పనులకే వెళుతుండడం సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను.

Advertisement

ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం తమ సమయాన్ని తమ మద్దతును ప్రకటించిన మంత్రులకు ,నాయకులకు అలాగే ప్రభుత్వ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సానుకూల ప్రభావాన్ని చూపించే కార్యక్రమాల కోసం మనమంతా ఎల్లప్పుడూ ఇలాగే కలిసికట్టుగా ఉందాం అంటూ అల్లు అర్జున్ తన అభిమానుల గురించి వారు చేపట్టిన కార్యక్రమం గురించి ప్రశంసిస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read: విజయ్ నాకు బావ కాదు.. అన్నయ్య ..రష్మిక చెల్లెలు షిమన్ సంచలన పోస్ట్!

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×