E-Paper
Advertisement

విజయ్ నాకు బావ కాదు.. అన్నయ్య ..రష్మిక చెల్లెలు షిమన్ సంచలన పోస్ట్!

విజయ్ నాకు బావ కాదు.. అన్నయ్య ..రష్మిక చెల్లెలు షిమన్ సంచలన పోస్ట్!
Advertisement

Shiman -Vijay Devarakonda: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ రష్మిక(Rashmika) విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీ రష్మిక విజయ్ దేవరకొండ ఉదయ్ పూర్ లో వివాహం జరుపుకున్నారు. ఇలా వీరి వివాహం జరిగి దాదాపు నెలన్నర అవుతున్నప్పటికీ ఇంకా కుటుంబ సభ్యులు అభిమానులు వీరి పెళ్లి వేడుకల నుంచి బయటపడలేదని తెలుస్తోంది. ఇలా ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్న ఈ జంటకు ఇటీవల రష్మిక తల్లిదండ్రులు కూర్గ్ లో కొడవ పద్ధతిలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ బావ కాదు ..అన్నయ్య..

ఇలా వీరి పెళ్లి వేడుక నుంచి కుటుంబ సభ్యులు ఇంకా బయటపడలేదని తెలుస్తోంది. తాజాగా రష్మిక మందన్న సోదరి షిమన్ మందన్న(Shiman Mandanna) ఇంస్టాగ్రామ్ వేదికగా రష్మిక విజయ్ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తన అక్క పెళ్లి గురించి అలాగే తన బావ విజయ్ దేవరకొండ గురించి చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన షిమన్ విజయ్ దేవరకొండను బావ కాదు అన్నయ్య అంటూ కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

పరుగులు పెడుతూ అలసిపోయాను..

Advertisement

షిమన్ ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ.. పెళ్ళికొడుకు ఫంక్షన్ నుంచి మొదలుకొని సంగీత్ ,హల్ది, పెళ్లి సందడి, నవ్వులతో నిండిన రోజులు గడిచిపోయాయి. ఈ సరదా చాలా త్వరగా జరిగిపోయిందని ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఇది నిజమేనా అనే భావన కలుగుతుందని, వీటిని గుర్తు చేసుకుంటే నా కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయని షిమన్ తెలిపారు. ఇలా ప్రతి వేడుకకు హాజరు కావాలన్న ఉద్దేశంతో స్కూలుకు బంక్ కొట్టానని, ఈ వేడుకలో జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పరుగులు పెడుతూ అలసిపోయాను. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని షిమన్ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఇక తన బావ విజయ్ దేవరకొండ గురించి కూడా మాట్లాడుతూ.. తనకు బావ కాదని సొంత అన్న అనే భావన కలుగుతుందని తెలిపారు. ఎన్నో జ్ఞాపకాలు ఇంకా ఎంతో ప్రేమ, కాస్త భావోద్వేగం వీటన్నింటిని ఎప్పటికీ మర్చిపోలేననీ తెలిపారు. ఈ వేడుకను ఇంత ఘనంగా జరిపించిన వెడ్డింగ్ ప్లానర్స్ అలాగే సంగీత్ కొరియోగ్రాఫర్లకు షిమన్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండను బావ కాదు అన్నయ్య అంటూ షిమన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బావను సొంత అన్నలా ఫీల్ అవుతుంది అంటే వారి కుటుంబం పట్ల విజయ్ ఎంత బాధ్యతగా ఉంటారో స్పష్టం అవుతుంది అంటూ అభిమానులు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.

Also Read: నాకు భజన చేయడం రాదు…నిహారిక పై చలాకి చంటి షాకింగ్ కామెంట్స్

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×