E-Paper
Advertisement

దిమ్మ తిరిగే రేంజ్ లో రాకా బడ్జెట్.. బన్నీ రెమ్యూనరేషన్ ఎంతంటే?

దిమ్మ తిరిగే రేంజ్ లో రాకా బడ్జెట్.. బన్నీ రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement

Raaka Budget: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా(Raaka) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను కూడా జరుపుకున్ననే తెలుస్తుంది. మరికొద్ది నెలలలో అల్లు అర్జున్(Allu Arjun) ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్, అట్లీ (Atlee)సినిమా నుంచి ఇటీవల టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గ్లోబల్ రేంజ్ లో రాకా…

ఈ సినిమాకు రాకా అనే టైటిల్ పెట్టడమే కాకుండా అల్లు అర్జున్ లుక్ కు సంబంధించిన పోస్టర్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమా పోస్టర్ బయటకు రావడంతో ఈ సినిమా బడ్జెట్ గురించి ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యూనరేషన్..

Advertisement

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమాకు సుమారు 800 నుంచి 900 కోట్ల వరకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నటుడు అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా సినిమా లాభాలలో 15% వాటా కూడా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకుంటే అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా సుమారు 300 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

విజువల్ వండర్ లా రాకా..

Advertisement

ఇక దర్శకుడు అట్లీ సైతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ఈయన కూడా 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె కూడా 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోబోతున్నారు అలాగే రష్మిక మందన్న సైతం ఈ సినిమాలో నెగిటివ్ పాత్రకు గాను ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో అట్లీ ఒక విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. మరి ఈ సినిమా బడ్జెట్ గురించి వచ్చే వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Also Read: ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ అప్డేట్…మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్..ఎందుకంటే?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×