E-Paper
Advertisement

మగాడికి లేని నిబంధన మాకెందుకు.. మోదీ సర్కార్ పై ట్రాన్స్ జెండర్లు నిప్పులు!

మగాడికి లేని నిబంధన మాకెందుకు.. మోదీ సర్కార్ పై ట్రాన్స్ జెండర్లు నిప్పులు!
Advertisement

Transgender Protest: స్వేచ్ఛ బ్యూరో: ట్రాన్స్ జెండర్లుగా మమ్మల్ని గుర్తించేందుకు‌ ప్రధాని మోడీ ప్రభుత్వం మా‌బట్టలు విప్పిస్తుందా అంటూ పలువురు ట్రాన్స్ జెండర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రాన్స్ జెండర్ల గుర్తింపు కోసం కేంద్రం తెచ్చిన చట్టాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ట్రాన్స్ జెండర్లు భారీగా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్ జెండర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టం తమకు అనుకూలంగా లేవన్నారు.

చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్..

ఒక మగాడు తాను మగాడిగా ఆస్పత్రికి వెళ్లి బట్టలు విప్పించుకొని గుర్తింపు కోరుకుంటారా అంటూ ట్రాన్స్ జెండర్లకు మాత్రం ఈ నిబంధన విధించడం అన్యాయం అన్నారు. ప్రధాని మోదీ ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత చట్టం తమ జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో విఫలమైందని అన్నారు. వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి, ట్రాన్స్ జెండర్లకు అనుకూలంగా ఉండే విధంగా కొత్త చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. సమాజంలో తమకు సమాన హక్కులు కల్పించాలని, వివక్ష లేకుండా గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు అవకాశాలు కల్పించాలని కోరారు.

Advertisement

Also Read: వైసీపీలో మౌన మునిలైన మాజీ మంత్రులు.. భయానికి అసలు కారణం అదేనా..?

ఆవేదన వ్యక్తం..

ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం చట్టాల్లో తక్షణ మార్పులు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తాము ఎంతో కష్టపడి ట్రాన్స్ జెండర్లుగా మారమన్నారు. సమాజంలో ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్టం వల్ల మా బ్రతుకులు మరింత దుర్భరం అవుతాయన్నారు. వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: హుజురాబాద్ డంపింగ్ యార్డ్ వద్ద బయటపడ్డ బిగ్ ఫైట్.. మీరిక మారరా..?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×