RAKA Movie : అల్లు అర్జున్ .. ..ఈ పేరిపుడు ఇండియన్ సినిమాకి బ్రాండ్ అయిపొయింది. ఏ ముహుర్తాన సుక్కు డైరెక్షన్ లో పుష్ప సిరీస్ చేశాడో కాని ఇండియా మొత్తం బన్నీకి ఫ్యాన్ అయిపొయింది. ముఖ్యంగా ‘పుష్ప: ది రైజ్’ (2021)తో ఒక హిందీలోనే ఏకంగా 812 కోట్లు కొల్లగొట్టి నార్త్ బెల్ట్ లో సాలిడ్ గా పాగా వేసేశాడు.ఇక ఈ నెంబర్ తో ఖాన్, కపూర్ల హవాకి ఒకరకంగా బ్రేక్ వేశాడనే చెప్పాలి.దీంతో బన్నీకి నార్త్ లో ఉన్న క్రేజ్ చూసి అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ (RAKA) పై ఒక కన్నేసి ఉంచినట్టు వస్తున్న వార్తలని చూస్తేనే తెలుస్తుంది.
బిహార్‌లో ‘రాకా’ రచ్చ.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య కుమ్ములాట?
దాదాపు ఏడాదిన్నర కిందట అంటే నవంబర్ 17, 2024న బీహార్ లోని పాట్నాలో జరిగిన ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గుర్తుందా..గాంధీ మైదాన్‌లో జరిగిన ఈ ఈవెంట్ తలుచుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్. పుష్పరాజ్ గా బన్నీ చూపించిన మ్యానరిజం కి లక్షాలాది బీహారీలు ఫిదా అయిపోయారు. ఇక వారి రియాక్షన్ చూసి మీడియాకి మెంటలొచ్చేసింది. ఇపుడు అదే క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ‘రాకా’ సినిమా రైట్స్ మాక్కావాలంటే మాక్కావాలి అంటూ యుద్ధం చేస్తున్నారట బీహార్ డిస్ట్రిబ్యూటర్లు.
also read :విక్రమ్ సాహిదేవ్ ‘అనకాపల్లి’ మాస్ ట్రీట్.. మంగ్లీ వాయిస్‌తో మారుమోగుతున్న అమ్మోరు పాట!
ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో బన్నీ చేసిన విధ్వంసం గుర్తుంచుకున్న అక్కడి డిస్ట్రిబ్యూటర్లు రాకా కోసం ఎంతైనా కుమ్మరించేందుకు సిద్ధమంటూ సవాల్ చేస్తున్నారట.
ఇక ఈ డిమాండ్ చూసే బాలీవుడ్ బాబులకన్నా మా బన్నీ బాబు కే ఎక్కువ డిమాండ్ ఉందిగా అంటూ కాలర్ ఎగరేస్తున్నారట అల్లు ఫ్యాన్స్.
800 కోట్ల బడ్జెట్.. అట్లీ మార్క్ ‘సైన్స్ ఫిక్షన్ మాస్’!
ఇదే అట్లీ షారుఖ్ కు ‘జవాన్’ (2023)తో రూ. 1100 కోట్ల హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు బన్నీతో అంతకు మించి 800 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలోనే ప్లాన్ వేసింది సన్ పిక్చర్స్.
అంటే అందరి క్రేజ్ మిక్స్ అయితే వీళ్ల లెక్క ప్రకారం సినిమా ఒక 2500 కోట్లని అలవోకగా టచ్ చేయాలన్న మాట.
ఇక బన్నీ బర్త్ డే (ఏప్రిల్ 8, 2026)రోజున ‘రాకా’ అంటూ టైటిల్ రివీల్ చేసిన మేకర్స్ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ బరిలో 5 భాషల్లోనే కాకుండా దాదాపు 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇక పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ఒక పవర్‌ఫుల్ వారియర్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.చూడాలి మరి ఇండియన్ టాప్ గ్రాసర్ గా తన ‘రాకా’ ని నిలబెట్టాలి అని కలలు కంటున్న బన్నీ ఆశలు నెరవేరుతాయో లేదో!
also read :వడదెబ్బకు చెక్ పెట్టే సూపర్ డ్రింక్స్: ఒక్క గ్లాసు తాగితే చాలు.. రోజంతా ఫుల్ ఎనర్జీ!