E-Paper
Advertisement

Allu Arjun : 30 శాతం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న బన్నీ… అంతా ఐబొమ్మ రవి పుణ్యమేనా??

Allu Arjun : 30 శాతం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న బన్నీ… అంతా ఐబొమ్మ రవి పుణ్యమేనా??
Advertisement

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పుష్ప సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్  చేశాడు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.. మూవీ తర్వాత అల్లు అర్జున్ రేంజ్  పూర్తిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన తమిళ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను దించారు. దాంతో ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఐబొమ్మ రవి వల్ల బన్నీ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి… ఇందులో నిజమేంత ఉందో కాస్త వివరంగా తెలుసుకుందాం..

రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్న అల్లు అర్జున్..

పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరో అయిన అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పెంచినట్లు ఆ మధ్య వార్తలు బాగానే వినిపించాయి. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో పుష్ప సినిమా కోసం 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న బన్నీ అట్లీ తో చేస్తున్న సినిమాకు కేవలం 100 కోట్లు తీసుకోనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు మిగతాదంతా సినిమా మేకింగ్ మీద ఖర్చు పెట్టమని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక తను నిజంగానే ఇలా చేస్తే ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి తను ఆదర్శంగా నిలుస్తాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు బన్నీ ఎందుకు రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నాడు? ఈయన లాగే మిగితా హీరోలు కూడా ఇదే ఫాలో అవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది..

Advertisement

Also Read : కియారా అద్వానీ – సిద్ధార్థ్ కూతురి పేరు రివీల్… అర్థం ఏంటంటే?

ఐబొమ్మ రవి వల్లే బన్నీ తగ్గించాడా..? 

స్టార్ హీరోల సినిమాలను పైరసి చేస్తూ ఆన్లైన్లో లీక్ చేస్తున్న ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇతని అరెస్ట్ సంచలనంగా మారింది.. హీరోలు రెమ్యూనరేషన్స్ భారీగా పెంచడం వల్ల సినిమా బడ్జెట్ పెరుగుతోంది. తద్వారా సినిమా టికెట్ల రేట్ ను పెంచుతున్నారు.. కొంతమందికి స్టార్ హీరోల సినిమాలు చూడటం కష్టంగా మారింది. అలాంటి జనాలకు ఫ్రీగా సినిమాను చూపించాడు రవి.. ఇకపోతే అతను చేస్తుంది తప్పుకాదు అని కొందరు ఐబొమ్మ రవికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తగ్గించాడనికి టాక్.. నెక్స్ట్ ఏ హీరో బన్నీని ఫాలో అవుతాడో చూద్దాం.. హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటేనే ఐబొమ్మ రవి లాంటోళ్ళు ఉండరని కొందరు అభిప్రాయ పడుతున్నారు..

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×