E-Paper
Advertisement

Kiara Advani: కియారా అద్వానీ – సిద్ధార్థ్ కూతురి పేరు రివీల్… అర్థం ఏంటంటే?

Kiara Advani: కియారా అద్వానీ – సిద్ధార్థ్ కూతురి పేరు రివీల్… అర్థం ఏంటంటే?
Advertisement

Kiara Advani: బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఈ ఏడాది తల్లి దండ్రులు అయ్యారన్న విషయం అందరికి తెలిసిందే.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది కియారా.. నెల ముందే అంటే జూన్ 16 న ఆమె ప్రసవించింది.. ఈ జంటకు పాప పుట్టడంతో చాలా సంతోషంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు పాప ఫోటోను కూడా షేర్ చేశారు. పాప పుట్టిన నాలుగు నెలల తర్వాత నామకరణం చేశారని తెలుస్తుంది. కియారా అద్వానీ తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ బుల్లి కియారా పేరుకు అర్థం ఏంటి అని ఆమె అభిమానులు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. మరి కియారా పాప పేరుకు అర్థం ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం..

కియారా – సిద్దార్థ్ కూతురి పేరు ఇదే..

బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా – సిద్దార్థ్ ల ప్రేమకు గుర్తుగా ఒక పాప జన్మించింది. ఈ ఏడాది జూన్ 16 న తల్లి దండ్రులు అయ్యారు. నాలుగు నెలల తర్వాత ఆ పాపకు పేరు పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా హీరోయిన్ కియారా అద్వానీ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో సాక్స్ లు వేసిన ఉన్న పాప కాళ్ళను కియారా, సిద్దార్థ్ చేతులలో పెట్టుకొని పిక్ ను తీసుకున్నారు. ఆ పోస్ట్ కింద పాప పేరు సారయ సిద్దార్థ్ అని రీవిల్ చేశారు. ఆ పేరుకు అర్థం యువరాణి.. ఈ పోస్ట్ చూసిన ఈ జంట అభిమానులు పేరు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..

Advertisement

Also Read : బిగ్ బాస్ లో చివరి కెప్టెన్ గా డిమాన్ పవన్.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది..

మూడేళ్ల పాటు డేటింగ్.. ఏడాదికి ప్రగ్నెంట్.. 

బాలీవుడ్ లో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర కు అందమైన జంటగా పేరుంది. దాదాపు మూడేళ్లు సీక్రేట్ గా ప్రేమించుకున్న ఈ జంట.. తమ ప్రేమ గురించి ఎక్కడా కూడా ప్రసవించలేదు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఎంత మంది ప్రశ్నించిన కూడా కామ్ తామ పనితాము చేసుకుంటూ వెళ్లారు. గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఇద్దరు ఎక్కడ పొరపాటున కూడా నోరు విప్పలేదు.. అయితే గత ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో మూడుముళ్ల బంధం లోకి అడుగుపెట్టారు.. సరిగ్గా ఏడాదికి తల్లితండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తర్వాత కియారా సినిమాలకు దూరంగా ఉంది.  ఇక ఈ ఏడాది జూన్లో పండంటి పాపకి జన్మనిచ్చి తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.. కియారా అద్వానీ చివరగా వార్ 2 చిత్రంలో నటించింది. సిద్ధార్థ మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు..

Advertisement

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×