E-Paper
Advertisement

Allu Arjun Spirit : ప్రభాస్ స్పిరిట్ మూవీ… 15 ఏళ్ల క్రితమే హింట్ ఇచ్చిన అల్లు అర్జున్

Allu Arjun Spirit : ప్రభాస్ స్పిరిట్ మూవీ… 15 ఏళ్ల క్రితమే హింట్ ఇచ్చిన అల్లు అర్జున్

Allu Arjun Spirit: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ (Allu Arjun)ప్రభాస్(Prabhas) వంటి వారు ఒకరు. ఇద్దరు హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా సక్సెస్ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్(Spirit) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. సందీప్ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ అంటేనే స్పిరిట్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

రెబల్ స్పిరిట్ టీ షర్ట్ ..

ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని బట్టి చూస్తుంటే స్పిరిట్ సినిమా ప్రభాస్ చేయబోతున్నారు అంటూ 15 సంవత్సరాల క్రితమే అల్లు అర్జున్ చెప్పారని తెలుస్తోంది. అసలు అల్లు అర్జున్ 15 ఏళ్ల క్రితం స్పిరిట్ సినిమా గురించి చెప్పడం ఏంటి అనే సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు. 15 సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ వేసుకున్న టీ షర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టీ షర్ట్ మీద రెబల్ స్పిరిట్(Rebel Spirit) అని ఉండటం అందరిని ఆకట్టుకుంటుంది.

షూటింగ్ పనులలో బిజీగా స్పిరిట్ టీం..

ఇలా టీ షర్ట్ పై రెబల్ స్పిరిట్ అని ఉండడంతో అల్లు అర్జున్ 15 ఏళ్ల క్రితమే స్పిరిట్ సినిమాని రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్నారని ఈ విధంగా హిట్ ఇచ్చారా అంటూ ప్రభాస్ అభిమానులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. స్పిరిట్ సినిమా షూటింగ్లోకి హీరోయిన్ త్రిప్తి దిమ్రి కూడా జాయిన్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది.

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి టైటిల్ కానీ, ఇతర అప్డేట్ కానీ వెల్లడించలేదు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇదివరకు అల్లు అర్జున్ ఎప్పుడూ నటించని కొత్త జోనర్ లో ఈ సినిమా రాబోతుందని ఇందులో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Also Read: Psych Siddhartha Trailer: నందు సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ రిలీజ్..ఇదేం యాక్టింగ్ రా బాబు!

Related News

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

Big Stories

×