Ranveer Singh: కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం కాంతార చాప్టర్ 1.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతారకు సీక్వెల్ గా ఇది వచ్చింది. థియేటర్లలోకి రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. ‘కాంతార’లో పంజుర్లీ దేవతకు సంబంధించిన విషయాన్ని చూపించారు. సినిమా మొత్తం ఈ దేవత కు సంబందించిన స్టోరీతోనే ఉంటుంది. దీన్ని రణవీర్ సింగ్ కామెడీ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అప్పటిలో బాగా విమర్శలను అందుకున్నాడు. అటు కన్నడ, ఇటు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.. తాజాగా ఈ న్యూస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందో కాస్త వివరంగా తెలుసుకుందాం..
రిషబ్ శెట్టి ఈ మూవీలో చాలా అద్భుతంగా నటించారు. ఇందులో ఓ అనే సౌండ్ జనాల్లో గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది. ఆ పదాన్ని పలికిన రణవీర్ కామెడీగా అన్నాడు. దాంతో అతనిపై ఎన్నో విధాలుగా ట్రోల్స్ మొదలైయ్యాయి. తాజాగా తనపై వినిపిస్తున్న విమర్శలపై హీరో రణవీర్ సింగ్ స్పందించారు..సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.. నిజానికి సినిమాలో రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఆ సీన్‌లో ఎలా చేశాడనేది చూపించాలనుకున్నాను. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను నేను ఎప్పటికీ గౌరవిస్తాను. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను అని రణ్‌వీర్ తన సోషల్ మీడియా అకౌంట్ స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది.. మొత్తానికి రణబీర్ దిగివచ్చి క్షమాపణలు చెప్పడంతో విమర్శలు కాస్త తగ్గినట్లు తెలుస్తుంది. మరి దీనిపై కన్నడీలు ఎలా స్పందిస్తారో చూడాలి…
Also Read : కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ ఫిట్టింగ్.. రీతూ, తనూజ మధ్య ఫైట్.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు..?
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ భారీ సక్సెస్ ని అందుకుంది.. ఆ సినిమాకు సీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 రీసెంట్గా థియేటర్లలో రిలీజ్ అయింది.. దసరా సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.. అయితే మొదటి పార్ట్ కన్నా రెండవ పార్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమా రిలీజ్ టైం లో నిర్వహించిన ఈవెంట్ కి చాలామంది దేవత వేషధారణలో వచ్చారు. అది చూసిన హీరో రిషబ్ శెట్టి సీరియస్ అయ్యారు.. గోవాలో జరిగిన ఈవెంట్ లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హాజరయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. హీరో రిషబ్ శెట్టి నటనపై ప్రశంసలు కురిపించారు. మీరు చేసిన ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని అన్నారు.. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన ‘ఓ..’ అనే హావభావాన్ని చేసి చూపించాడు. అయితే ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది.. దాంతో కర్ణాటక ప్రజలు తమ ఆరాధ్య దైవాన్ని అవమానించేలా చేశారు అంటూ రణవీర్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయనపై విమర్శలు కూడా చేశారు.. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా తర్వాత దీనిపై రణవీర్ రియాక్ట్ అవ్వడం విశేషం..
Ranveer Singh literally mocking Daiva Chavundi possession in Kantara.
How low these movie stars can go for fame, money with zero respect for sacred Tulunad Daivaradhane beliefs🥺
Shame.Rishabh is enjoying that mimic?@RanveerOfficial @shetty_rishab pic.twitter.com/F4x0X2rVmA
— Vije (@vijeshetty) November 29, 2025