E-Paper
Advertisement

AA22 Shooting Update : అల్లు అర్జున్ ‘AA22 ‘ షూటింగ్ అప్డేట్.. ప్రమోషన్స్ అప్పుడే..?

AA22 Shooting Update : అల్లు అర్జున్ ‘AA22 ‘ షూటింగ్ అప్డేట్.. ప్రమోషన్స్ అప్పుడే..?

AA22 Shooting Update : గత ఏడాది చివరిలో థియేటర్లలో రిలీజ్ అయిన అల్లు అర్జున్ మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. ఒకవైపు విమర్శలు వినిపించాయి.. మరోవైపు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ కు పుష్ప సినిమాలు మంచి క్రేజ్ ను అందించాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాల్సింది. కానీ స్టోరీలో మార్పుల కారణంగా అది లేట్ అవ్వడంతో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ ఆట్లీతో 22 వ సినిమాను చేస్తున్నాడు బన్నీ.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి అప్డేట్స్ బయటకు రాలేదు కానీ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చింది.. దాదాపు 50 శాతం పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. ప్రమోషన్స్ ను త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

AA22 షూటింగ్ అప్డేట్.. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో మూవీ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా భారీ విజువల్స్ తో గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో ఆయన గ్రాఫిక్స్ ఉన్న సన్నివేశాలను ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు 44% షూటింగ్ కంప్లీట్ చేసిన అట్లీ తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట.. అల్లు అర్జున్ కూడా అదే విధంగా షూటింగ్ ను పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట.. పుష్ప 2 ను మించిన భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Also Read : భరణికి షాకిచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. కన్నీళ్లు పెట్టుకున్న తనూజ..చివర్లో ట్విస్ట్..

భారీ యాక్షన్ సీక్వెన్స్ గా మూవీ.. 

పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కావడంతో దీని పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా డైరెక్టర్ అట్లీ ట్రాక్ రికార్డు బాగా ఉంది.. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ భారీ విజయాన్ని అందుకుంది. అట్లీ కమర్షియల్ సినిమాలను చాలా బాగా హ్యాండిల్ చేయగలడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న చిత్రం భారీ విజువల్స్ తో గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా తెరకెక్కుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాకు పనులను చేయించుకుంటున్న అట్లీ మొత్తానికైతే తను అనుకున్నట్టుగా అవుట్ ఫుట్ ను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మరి ఆయనకు ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి.. అల్లు అర్జున్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ ను అందిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట.. ఆ లుక్ రెస్పాన్స్ ను బట్టి మూవీలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్..

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×