E-Paper
Advertisement

HBD Anil Ravipudi: అనిల్ రావిపూడి బర్త్ డే స్పెషల్… విద్యా రంగంలోకి స్టార్ డైరెక్టర్!

HBD Anil Ravipudi: అనిల్ రావిపూడి బర్త్ డే స్పెషల్… విద్యా రంగంలోకి స్టార్ డైరెక్టర్!
Advertisement

HBD Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా ఎంతోమంది కొనసాగుతున్నారు అయితే ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడి జాబితా చూస్తే అందులో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉండగా తదుపరి అనిల్ రావిపూడి (Anil Ravipudi) పేరు ఉంటుంది. పటాస్ సినిమా ద్వారా అనిల్ రావిపూడి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతకుముందు కథ రచయితగా పనిచేస్తున్న ఈయన పటాస్ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఇప్పటివరకు ఒక అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు.

ఘట్ కేసరి ప్రాంతంలో స్కూల్?

ఇక అనిల్ రావిపూడి నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయనకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనిల్ రావిపూడి కి సంబంధించి ఒక వార్త భారీగా వైరల్ అవుతుంది. దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి త్వరలోనే విద్యారంగంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈయన ఘట్ కేసర్ ప్రాంతంలో ఒక స్కూల్ ప్రారంభించబోతున్నారని, ప్రస్తుతం ఈ పాఠశాల నిర్మాణ దశలో ఉందని తెలుస్తోంది. అతి త్వరలోనే అనిల్ రావిపూడి ఈ స్కూల్ (school) ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఇలా ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతూ మరోవైపు విద్యారంగంలోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విద్యాసంస్థలను ప్రారంభించబోతున్న అనిల్ రావిపూడి?

Advertisement

గతంలో కూడా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇలాగే ఇండస్ట్రీలో కొనసాగుతూ మరోవైపు శ్రీ విద్యానికేతన్ పేరిట పాఠశాల ప్రారంభించారు. అయితే ఈ పాఠశాల అంచలంచలుగా ఎదుగుతూ నేడు మోహన్ బాబు యూనివర్సిటీగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. మోహన్ బాబు తరహాలోనే అనిల్ రావిపూడి కూడా విద్యా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి వరుస హిట్ సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈయన రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది.

హీరోల కంటే అధిక రెమ్యూనరేషన్..

Advertisement

అనిల్ రావిపూడి చివరిగా వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి హీరో వెంకటేష్ కంటే కూడా అధిక రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఈయన ఆ రెమ్యూనరేషన్ పెట్టుబడిగా పెట్టి విద్యాసంస్థలను ప్రారంభించబోతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అనిల్ రావిపూడి పక్కాగా అనుసరిస్తున్నారని చెప్పాలి. ఇలా స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈయన స్కూల్ ప్రారంభించాలనే ఒక మంచి ఆలోచన చేశారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి స్కూల్స్ గురించి వస్తున్న ఈ వార్తలపై త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం.

Also Read: Maryada Manish : టాప్ 5 కంటెస్టెంట్ల లిస్ట్ చెప్పిన మనీష్ మర్యాద..ఎవరెవరున్నారంటే?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×