E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: భరణికి షాకిచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. కన్నీళ్లు పెట్టుకున్న తనూజ..చివర్లో ట్విస్ట్..

Bigg Boss 9 Telugu: భరణికి షాకిచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. కన్నీళ్లు పెట్టుకున్న తనూజ..చివర్లో ట్విస్ట్..
Advertisement

Bigg Boss 9 Telugu: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్. 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్లోకి అడుగు పెట్టింది.. ఈ సీజన్ ప్రసారమయ్యే 10 వారాలు పూర్తయి 11వ వారం ప్రసారం అవుతుంది.. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ పూర్తి కావస్తుంది. గత సీజన్లో సెలబ్రిటీ నిఖిల్ విన్నర్ గా నిలిచారు. మరి ఈ సీజన్లో సెలబ్రిటీలు విన్నర్గా నిలుస్తారా? కామనర్స్ విన్నర్ గా నిలిచి ట్రోఫీని అందుకుంటారా అన్నది జనాలు ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్న.. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది తెలియలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమో మొత్తం ఎమోషనల్ గా సాగింది. కాస్త నవ్వులు కూడా పూయించింది. మరి ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

భరణికి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్..

బిగ్ బాస్ 9 తెలుగు ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ముందుగా కమెడియన్, హీరో శ్రీనివాస్ రెడ్డి, సుమన్ శెట్టి పిల్లలతో కలిసి వచ్చాడు. తన పిల్లల్ని చూడగానే సుమన్ శెట్టి చాలా సంతోషపడతాడు. ఫ్లయింగ్ కిస్ లు ఇస్తాడు పక్కనే ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఏంటి ఈ కిస్సులన్నీ నాకేనా అని సెటైర్లు వేస్తాడు.. నా పిల్లల కన్నా అని సుమన్ శెట్టి అంటాడు. మీరు చాలా బాగా ఆడుతున్నారు నాన్న కచ్చితంగా కప్పుతోనే ఇంటికి రావాలి అని ఆయన పిల్లలు అనడంతో ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత నాగార్జున అక్కడ ఉన్న దాంట్లో కొన్ని ఫేసులు ఉంటాయి అది ఎవరికి సెట్ అవుతుందో మీరు చెప్పాలి అని అడుగుతాడు.. అందులోంచి బ్రహ్మానందం ఫోటోని బయటకు తీస్తాడు. మా గురువుగారు వచ్చారు ఇది కచ్చితంగా సుమన్ శెట్టికి షూట్ అవుతుందని అంటాడు.. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా చెప్పాలా అని నాగార్జున అడుగుతాడు. భరణిని చూడగానే బయట ఏ చెరుకు మిషన్ చూసినా నాకు భరణినే గుర్తొస్తున్నాడు. అక్కడ చెరుకు మిషన్ నుంచి రసం బయటకు వచ్చినట్లు ఇక్కడ భరణి అటూ ఇటూ నలిగిపోయి పిప్పి లాగా మారిపోయాడు. అయితే ఆ మిషన్ నుంచి రసం వస్తుంది. కానీ ఈ మిషన్ నుంచి ఎటువంటి రసాలు రావట్లేదు అని ఇన్ డైరెక్ట్ గా ఇంకా మంచిగా ఆడాలి అంటూ హింట్ ఇస్తాడు..

Advertisement

Also Read :ఎలిమినేషన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. అందరూ సేఫ్..

కన్నీళ్లు పెట్టుకున్న తనూజ.. 

ఆ తర్వాత హౌస్ లోకి హరిత జాకి, సీరియల్ నటుడు పవన్ సాయి వస్తారు.. హరితను చూడగానే తనుజ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను చాలా మిస్ అవుతున్నాను అని ఏడ్చేస్తుంది. ఏడవను అనే మాట ఇచ్చావు మళ్లీ ఏడుస్తున్నావ్ ఏంటి అని నాగార్జున అంటాడు.. నేను చాలా బాగున్నాను అని తనూజ అంటుంది.. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నీకోసం మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు నువ్వు కప్పు ఎప్పుడు తీసుకొస్తావని మేం కూడా వెయిట్ చేస్తున్నామని హరిత అంటుంది.. పవన్ సాయి కూడా అందులోంచి ఒక ఫోటోని తీస్తాడు. విజయ్ దేవరకొండ ఎవరికి సూట్ అవుతాడు అని అంటే పవన్ హౌస్ లో విజయ్ దేవరకొండ అని అంటారు. నాగార్జున విజయ్ దేవరకొండ పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉంది ఏంటో చెప్పు అని అడుగుతాడు. అది నా పిల్ల.. జాగ్రత్తగా చూసుకోండి అని పవన్ వార్నింగ్ ఇస్తాడు. భరణిని నాన్నగారు మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని తనుజను అప్పగిస్తాడు. వీరిద్దరి ప్రేమాయణం ప్రోమోలో హైలెట్గా నిలిచింది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. ఇక ఇవాళ ఎపిసోడ్లో ఇంకెన్ని ఎమోషనల్ సీన్లు కనిపిస్తాయో చూడాలి..

Advertisement

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×