E-Paper
Advertisement

Pushpa 2 Release : జపాన్‌లోనూ మొదలు కానున్న పుష్ప రూల్.. విడుదల ఎప్పుడంటే?

Pushpa 2 Release : జపాన్‌లోనూ మొదలు కానున్న పుష్ప రూల్.. విడుదల ఎప్పుడంటే?
Advertisement

Pushpa 2 Release: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)సుకుమార్ కాంబినేషన్ ల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఇప్పటికే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2024 డిసెంబర్ 4వ తేదీ ఈ సినిమా రెండవ భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సినిమా విడుదలయ్యి రేపటికి ఏడాది అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం మరోసారి ఈ సినిమా స్పెషల్ షో వేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

జపాన్ లో విడుదల కానున్న పుష్ప 2..

డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5:30 విమల్ థియేటర్లో ఈ సినిమా స్పెషల్ షో వేయనున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడటానికి అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. అయితే పుష్పగాడి రూల్ ఇప్పుడు జపాన్ (Japan)లో కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాని జపాన్ లో విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించారు అయితే ఈ సినిమా 2026 జనవరి 16వ తేదీ విడుదల కాబోతోంది. ఇలా జపాన్ లో విడుదలకు పుష్ప 2 సిద్ధమైన నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఆదరణ అందుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప 3 షూటింగ్ అప్పుడే..

Advertisement

ఇక ఈ సినిమా జనవరి 16వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం జపాన్ లో పర్యటించి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ రష్మిక ప్రధాన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పుష్ప 3 పట్ల కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2027 చివరికి షూటింగ్ పనులు ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

సూపర్ హీరో కథతో బన్నీ…

Advertisement

ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్ మరొక దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని ఇప్పటివరకు ఎవరు చేయని జోనర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. మరి అల్లు అర్జున్ లోకేష్ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.

Also Read: VD 14 Film : క్లైమాక్స్ షూటింగ్‌లో విజయ్ మూవీ.. హాలీవుడ్ మమ్మీ విలన్‌తో డిష్యూం డిష్యూం

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×