E-Paper
Advertisement

VD 14 Film : క్లైమాక్స్ షూటింగ్‌లో విజయ్ మూవీ.. హాలీవుడ్ మమ్మీ విలన్‌తో డిష్యూం డిష్యూం

VD 14 Film : క్లైమాక్స్ షూటింగ్‌లో విజయ్ మూవీ.. హాలీవుడ్ మమ్మీ విలన్‌తో డిష్యూం డిష్యూం
Advertisement

VD 14 Film: సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అనుకున్న విధంగా తన సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇటీవల కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం ఈయన రాహుల్ సాంకృత్యన్(Rahul Sankrityan) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

మమ్మీ విలన్ తో పోటీ పడుతున్న విజయ్..

ఇక రాహుల్ సాంకృత్యన్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే నటీ నటులను కూడా భాగం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ దిగ్గజ నటుడు ఆర్నల్డ్ వసూల్(Arnold Vosloo ) నటించబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అందుకున్న మమ్మీ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా ఈయన విజయ్ దేవరకొండతో పోటీ పడబోతున్నారని తెలుస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

బ్రిటిష్ అధికారిగా ఆర్నల్డ్ వసూల్ ..

Advertisement

విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లోని పాశమైలారంలో జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఆర్నల్డ్ వసూల్ నెగిటివ్ పాత్రలో బ్రిటిష్ అధికారిగా కనిపించబోతున్నారని సమాచారం. ఇలా బ్రిటిష్ అధికారి పాత్రలో ఆర్నల్డ్ వసూల్ నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ ఇద్దరి మధ్య భారీ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారకంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం.

విజయం వరించేనా…

Advertisement

ఇలా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమాపై కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ పెడుతూ శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకోనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా 2026 లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే విజయ్ దేవరకొండ సినిమా కథల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని అభిమానులు కూడా ఈయన సినిమాపై కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండకు నిరాశ ఎదురయింది. మరి కొత్త సంవత్సరంలో ఈయన రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాలైనా విజయ్ దేవరకొండకు విజయం అందించేనా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Raj Nidimoru -Samantha: సమంతకు అదిరిపోయే పెళ్లి కానుక ఇచ్చిన రాజ్ .. ఫిదా అయిన సామ్?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×