Raaka Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో రాకా(Raakaa) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి అయితే దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు సినిమాకు సంబంధించి సరైన అప్డేట్స్ మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో లీక్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులు భావించారు.
రాకా సినిమా 2027 డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి మరొక వార్తా హల్చల్ చేస్తుంది. అందరూ అనుకుంటున్నట్టుగా రాకా సినిమా 2027లో విడుదల కావడంలేదని ఈ సినిమా 2028 జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా ఈ సినిమా కోసం 2028 వరకు వేచి ఉండాలనే విషయం తెలిసిన అభిమానులు కాస్త నిరుత్సహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై చిత్ర నిర్మాతలు ఎక్కడ స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల విషయంలో అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీ పై చిత్ర నిర్మాతలు స్పందిస్తే తప్ప క్లారిటీ రాదని చెప్పాలి. ఇకపోతే రాకా సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో తండ్రి ఇద్దరు కొడుకులుగా ఈయన కనిపించనున్నారని ఒక కొడుకు పాత్రలో అల్లు అర్జున్ విలన్ గా నటిస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి.
🚨 𝐒𝐇𝐎𝐂𝐊𝐈𝐍𝐆 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 🚨
Allu Arjun’s #𝐑𝐀𝐀𝐊𝐀 Is 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋𝐋Y Set For 𝟐𝟔𝐓𝐇 𝐉𝐀𝐍𝐔𝐀𝐑𝐘 𝟐𝟎𝟐8 Release🗓️❤️🔥❤️🔥!
Targeting A 𝟓-𝐃𝐀𝐘 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃 𝐑𝐄𝐏𝐔𝐁𝐋𝐈𝐂 𝐃𝐀𝐘 𝐖𝐄𝐄𝐊𝐄𝐍𝐃 🥁, The Film Has Announced Its Release Date Via Its… pic.twitter.com/ldGV5jN8tq
— Movies Buster (@buster_movies) September 4, 2026
ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే (Deepika Padukone) ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఈమె ప్రధాన పాత్రలో నటించగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. సన్ పిక్చర్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా బన్నీ సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజులలో పూర్తి అయినప్పటికీ విఎఫ్ ఎక్స్ పనుల కారణంగా ఈ సినిమా విడుదలకు మరింత సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తన తదుపరిచిత్రాన్ని మరో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!