E-Paper
Advertisement

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?
Advertisement

Ravi Teja Horror Comedy: ఇరుముడి బాక్సాఫీస్ వద్ద ఇరగదీస్తుండటంతో ఇపుడు రవితేజకి ఎక్కడ లేని డిమాండ్ వచ్చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఏకంగా రెండు వందల కోట్ల మార్క్ దాటేసి దూసుకుపోతుండటంతో ఇపుడు వరుస సినిమాలని లైనప్ చేస్తూ మాంచి జోరు మీదున్నాడు మన మాస్ మహారాజ.

హసిత్ గోలి దర్శకత్వంలో

ఇక ఈ క్తమంలోనే హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ చేయబోతున్న సంగతి తెల్సిందే. శ్రీవిష్ణుతో ‘రాజ రాజ చోర’సినిమా తీసి సత్తా చాటిన హసిత్ గోలి స్వాగ్ అంటూ మరో సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెల్సిందే.ఇక తాజాగా దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా తెరకెక్కించ నున్న ఈ సినిమా జనవరి 14న రిలీజ్ చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.

హారర్ కామెడీ జానర్‌లో

Advertisement

ఇక ఈసినిమాతో పాటు ‘సరిపోదా శనివారం’తో సత్తా చాటిన వివేక్ ఆత్రేయతో కూడా రవితేజ మరో సినిమాని లైనప్ చేశాడు.అయితే ఊహించని విధంగా ఈ సినిమా హారర్ కామెడీ జానర్‌లో ఉండొచ్చనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది.

నిజానికి కామెడీ అంటే రవితేజకి కొట్టిన పిండి.కానీ హారర్‌ను కామెడీతో కలిపి పూర్తి స్థాయి హారర్ కామెడీ హీరోగా చేసిన సినిమా దాదాపు లేదనే చెప్పాలి.అంటే ఈ జానర్ కనుక ఫిక్స్ అయితే మాత్రం. భయపెడుతూనే నవ్వించాల్సిన బాధ్యత ఈసారి రవితేజపై పడబోతోందన్నమాట.

రవితేజకి సెట్ అవుతుందా?

Advertisement

అసలు ఈ జానర్ రవితేజకి సెట్ అవుతుందా? అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రవితేజ గత కొంతకాలంగా ‘ధమాకా’లో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్, ‘టైగర్ నాగేశ్వరరావు’లో పీరియడ్ బయోపిక్ యాక్షన్, ‘ఈగల్’లో యాక్షన్ థ్రిల్లర్, ‘మిస్టర్ బచ్చన్’లో కమర్షియల్ డ్రామా.. ‘ఇరుముడి’తో ఎమోషనల్ డ్రామా అంటూ ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతూ పోతున్నాడు,అలాంటిది ఇపుడు ఎప్పుడూ చేయని హర్రర్ కామెడీని ఎంతవరకు లాక్కు వస్తాడా అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్.

అయితే నిజానికి హారర్ కామెడీ చేయాలంటే ఒకవైపు సీరియస్‌గా భయపడాలి.. మరోవైపు అదే సీన్‌లో కామెడీ పండించాలి. రవితేజకి ఉన్న సహజమైన కామెడీ టైమింగ్, ఆయన ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ హారర్ కామెడీకి బాగాసెట్ అవుతుంది అంటూ  మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.

ఎలాంటి హారర్ కామెడీ కథను తయారు చేశారో

మరో వైపు వివేక్ ఆత్రేయ సినిమాల్లో కథ కంటే క్యారెక్టర్లు, డైలాగులు, పరిస్థితుల నుంచి వచ్చే హ్యూమర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది.‘బ్రోచేవారెవరురా’ నుంచి ‘మెంటల్ మదిలో’, ‘అంటే సుందరానికి’, ‘సరిపోదా శనివారం’ వరకు ఆయన చేసిన సినిమాల్లో ఇది క్లియర్ గా కనిపిస్తుంది కూడా.

ALSO READ:సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

ఇక సినిమా విషయానికి వస్తే  వివేక్ ఆత్రేయ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అక్టోబర్ 12 నుంచి షూటింగ్ మొదలెట్టి సమ్మర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది..మరి రవితేజ లాంటి మాస్ హీరోతో ఆయన ఎలాంటి హారర్ కామెడీ కథను తయారు చేశారో చూడాలి.

Tags

Related News

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

Big Stories

Advertisement
×