E-Paper
Advertisement

Allu Ayaan: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ‘లిటిల్ ఐకాన్ స్టార్’.. అప్పుడే లైన్‌లో పెట్టేశారా?

Allu Ayaan: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ‘లిటిల్ ఐకాన్ స్టార్’.. అప్పుడే లైన్‌లో పెట్టేశారా?
Advertisement

Allu Ayaan: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటన, డ్యాన్స్ స్టైల్‌కు దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ అంతా ఆయన వారసుడు అల్లు అయాన్ గురించే. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ, అయాన్ చిన్న వయసులోనే క్రమశిక్షణ, బలం ఏకాగ్రతను అలవర్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకు అంటే వాటన్నిటి కలయికతో చేసే మార్షల్ ఆర్చ్ నేర్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-Harish Shankar: మహేష్ బాబుపై చేసిన కామెంట్‌కు క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్.. అది చూడలేదంటూ..

వైరల్ అవుతున్న మార్షల్ ఆర్ట్స్ వీడియో

Advertisement

తాజాగా అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ వీడియోలో అయాన్ చాలా ప్రొఫెషనల్‌గా స్టంట్స్ చేయడం, కిక్స్ విసరడం కనిపిస్తోంది. చిన్న వయసులోనే అంతటి పట్టుదల చురుకుదనం ప్రదర్శిస్తున్న అయాన్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు విలాసాలకు పరిమితం అవుతారని అనుకుంటారు, కానీ అల్లు అర్జున్ తన పిల్లలను క్రమశిక్షణతో కూడిన పద్ధతుల్లో పెంచుతున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం శారీరక శక్తికే కాకుండా, మానసిక దృఢత్వానికి కూడా ఎంతో తోడ్పడుతుంది. అయాన్ ఈ విద్యను నేర్చుకోవడం ద్వారా తనలో ఫోకస్, సెల్ఫ్-డిసిప్లిన్‌ను పెంచుకుంటున్నాడని స్పష్టమవుతోంది.

Read also-Harish Shankar: పవన్ విషయంలో స్వార్థం.. డైరెక్టర్ ఏమన్నారంటే?

ఖుషీ అవుతున్న బన్నీ ఫ్యాన్స్

Advertisement

ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. “జూనియర్ అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు” అని కొందరు, “తండ్రికి తగ్గ తనయుడు.. త్వరలోనే వెండితెరపై రచ్చ చేస్తాడు” అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ స్వయంగా తన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు అయాన్ కూడా అదే బాటలో నడుస్తుండటం విశేషం. ఇప్పటికే అల్లు అర్హ ‘శాకుంతలం’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసి అందరినీ మెప్పించింది. ఇప్పుడు అయాన్ తన యాక్షన్ స్కిల్స్‌తో భవిష్యత్తులో మాస్ హీరోగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి అల్లు అయాన్ మార్షల్ ఆర్ట్స్ వీడియో కేవలం అభిమానులకే కాకుండా, పిల్లల్లో శారీరక శ్రమ, క్రమశిక్షణ ఎంత అవసరమో చెప్పేలా ఉంది. చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభ కనబరుస్తున్న అయాన్, భవిష్యత్తులో అల్లు వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అల్లు అయాన్ కొన్ని వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పడు మరో వీడియో వైరల్ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీ ఫోకస్ మొత్తం అల్లు అయాన్ పై పడింది. అల్లు అర్జున్ తర్వాత తరాన్ని కూడా అప్పుడే రెడీ చేసేస్తున్నారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×