E-Paper
Advertisement

Harish Shankar: పవన్ విషయంలో స్వార్థం.. డైరెక్టర్ ఏమన్నారంటే?

Harish Shankar: పవన్ విషయంలో స్వార్థం.. డైరెక్టర్  ఏమన్నారంటే?
Advertisement

Harish Shankar:గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. అసలే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్.. మరొకవైపు సక్సెస్ కోసం ఆరాటపడుతున్న శృతిహాసన్ ఇద్దరూ కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే మళ్లీ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా రావాలి అని అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా .. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో ఆ కోరిక కాస్త తీరబోతోంది. మార్చి 19వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కానున్న విషయం తెలిసిందే.

పవన్ విషయంలో ఆ స్వార్థం ఉంది – హరీష్ శంకర్

మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై అటు అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు , ప్రోమోలతో సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది. దీనికి తోడు తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొని చేసిన కామెంట్లు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి అనడంలో సందేహం లేదు. హరీష్ శంకర్ ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఇది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అవుతుంది. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ను చూపించిన తీరు ఒక ఎత్తైతే.. ఇందులో అంతకంటే ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ను వెండితెరిపై అత్యంత పవర్ఫుల్ గా, మాస్ గా చూపించాలనే స్వార్థం నాకుంది. సినిమా చూసిన తర్వాత అందరూ పవన్ ను ఇంత మాస్గా హరీష్ మాత్రమే చూపించగలడు అని అనాలని నేను భావిస్తున్నాను” అంటూ హరీష్ శంకర్ తెలిపారు. మొత్తానికైతే హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్లు పవన్ పట్ల ఆయనకున్న అభిమానాన్ని మరోసారి నిరూపితం చేసింది.

Advertisement

ALSO READ:Ram Charan: సుకుమార్ మూవీ నుండి బిగ్ అప్డేట్.. భలే ప్లాన్ చేశారే?

సెన్సార్ పూర్తి చేసుకున్న ఉస్తాద్..

ఇకపోతే శ్రీ లీల , రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేశారు. సుమారుగా 2 గంటల 29 నిమిషాల రన్ టైం తో రాబోతున్న ఈ చిత్రానికి తమన్ , దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ కూడా సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన “కాలర్ ఏ ఎత్తరా ” పాట సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా ఉగాది పండుగకు భారీ బ్లాక్ బాస్టర్ అవుతుందని పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబో మళ్లీ మ్యాజిక్ సృష్టిస్తుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మరి ఈ కాంబో కచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందనే కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×