Allu Sirish:అల్లు శిరీష్.. అల్లు రామలింగయ్య మనవడిగా.. అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తన అన్నయ్య అల్లు అర్జున్ రేంజ్ లో స్టార్ స్టేటస్ ను అయితే సొంతం చేసుకోలేదని చెప్పాలి. ఇకపోతే కెరియర్లో సక్సెస్ కోసం ఆరాటపడుతున్న ఈయన.. మరొకవైపు తన వ్యక్తిగత జీవితంలో ఒక అడుగు ముందుకు వేసిన విషయం తెలిసిందే.
అలా గత రెండు సంవత్సరాలుగా తాను ప్రేమిస్తున్న అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోబోతున్నాను అని దివంగత నటుడు అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ పోస్టు ద్వారా వెల్లడించారు. ఆ తరువాత ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఏడాది అక్టోబర్ 31న తాను ప్రేమించిన నయనిక అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ అభిమానులు ప్రశ్నించగా తాజాగా అల్లు అయాన్, అల్లు అర్హాలతో కలిసి ఒక ఫన్నీ వీడియో చేస్తూ తన పెళ్లి తేదీని కూడా ప్రకటించారు అల్లు శిరీష్ .
తాజాగా తన పెళ్లి తేదీని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు అల్లు శిరీష్. తన పెద్దన్నయ్య కూతురితోపాటు తన రెండవ అన్నయ్య అల్లు అర్జున్ పిల్లలైనా అల్లు అర్హ, అల్లు శిరీష్ లతో కలిసి ట్రెండింగ్ సాంగ్ తో పెళ్లి డేట్ ను రివీల్ చేశాడు అల్లు శిరీష్. అమ్మాయిలు ఇద్దరూ పెళ్లెప్పుడు బాబాయ్ ?అని అడగగా.. అల్లు అయాన్ తో కలిసి మార్చి 6 2026 అంటూ తెలిపారు. అమ్మాయిలు ఇద్దరు సంగీత్ ఎప్పుడు బాబాయ్ ? అని ప్రశ్నించగా.. మనం సౌత్ ఇండియన్స్ కదా అలాంటివేమి ఉండవు అంటూ తెలిపారు. మొత్తానికైతే పెళ్లి తేదీని ప్రకటించారు. కానీ సంగీత్ లాంటి కార్యక్రమాలు ఉండవు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పెళ్లి తేదీ చూసి అభిమానులు అల్లు శిరీష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అల్లు శిరీష్ వివాహం చేసుకోబోతున్న అమ్మాయి విషయానికి వస్తే.. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఈమె ఒక బడా వ్యాపారవేత్త కుటుంబానికి చెందింది. 2023 అక్టోబర్లో వరుణ్ తేజ్ , లావణ్య పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో నితిన్ – షాలిని కలిసి ఒక పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. అప్పుడే నయనికను తొలిసారి కలిసిన శిరీష్ రెండేళ్ల తర్వాత ఆమె ప్రేమలో పడ్డారట. సంతోషంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నామని , కొన్నేళ్ల తర్వాత తన పిల్లలు ఇదంతా ఎక్కడ మొదలైంది నాన్న అని అడిగితే అలా మీ అమ్మను కలిశానని చెబుతాను అంటూ అల్లు శిరీష్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేయడానికి పెళ్లి డేట్ ను కూడా ప్రకటించారు.
also read:Nidhhi Agerwal: ‘మళ్లీ దొరికిపోయా’.. తప్పు ఒప్పుకున్న నిధి అగర్వాల్
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==