E-Paper
Advertisement

Allu Sirish: ఆ ఘటన నా జీవితాన్ని మార్చేసింది… అదే ఆఖరి సారి.. అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Allu Sirish: ఆ ఘటన నా జీవితాన్ని మార్చేసింది… అదే ఆఖరి సారి.. అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Advertisement

Allu Sirish: అల్లు శిరీష్ పరిచయం అవసరం లేని పేరు. త్వరలోనే అల్లు శిరీష్ తన ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నైనిక రెడ్డి(Nainika Reddy)అనే అమ్మాయిని ప్రేమించి శిరీష్ (Sirish)పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి వివాహం మార్చి ఆరో తేదీ జరగబోతున్న సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ హీరో పెద్ద ఎత్తున అభిమానులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన ఫోటోలు వీడియోలను స్వయంగా శిరీష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకను వీళ్ళు ఒక క్రూజర్ షిప్ లో జరుపుకున్నట్టు తెలుస్తోంది.

ఆల్కహాల్ అలవాటు …

ఇక త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈయన తన కాబోయే భార్య నైనికతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శిరీష్ తనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.. ఇటీవల కాలంలో ఆల్కహాల్ (alcohol)అలవాటు లేని వారు ఎవరు ఉండరు అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మాయిలు కూడా పలు సందర్భాలలో తాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఆల్కహాల్ తీసుకోవడం గురించి అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తృటిలో బయటపడిన శిరీష్

Advertisement

తనకు గతంలో ఆల్కహాల్ తీసుకొనే అలవాటు ఉండేదని తెలిపారు అయితే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆల్కహాల్ తాగినప్పుడు పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డానని, ఆ ఘటన తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశానని, జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్కడా కూడా టేస్ట్ చేయలేదని తెలియజేశారు. ఇలా ఆల్కహాల్ కారణంగా ప్రమాదానికి గురై ఆ ప్రమాదం నుంచి తృటిలో బయటపడటంతో శిరీష్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. ఆల్కహాల్ తాగడం గురించి శిరీష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా మంచి నిర్ణయం అంటూ అభిమానులు కూడా అల్లు శిరీష్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

గౌరవం సినిమాతో హీరోగా పరిచయం

Advertisement

ఇక అల్లు శిరీష్ కెరియర్ విషయానికి వస్తే.. ఈయన  అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. గౌరవం సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన శిరీష్ అనంతరం కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, బడ్డీ వంటి సినిమాలలో నటించారు అయితే ఏ సినిమాలు కూడా శిరీష్ కు సరైన గుర్తింపు మాత్రం తీసుకురాలేదు. అల్లు వారసుడిగా బన్నీ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నప్పటికీ ఆయన తమ్ముడు శిరీష్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అందుకోలేకపోవటం గమనార్హం. మరి పెళ్లి తర్వాత నైనా శిరీష్ కు ఇండస్ట్రీలో కలిసి వస్తుందా హీరోగా సక్సెస్ అందుకునేనా అనేది తెలియాల్సి ఉంది.

Also Read; Lenin Bharathi: అప్పుడు ఎక్కడికి వెళ్లారు? స్వీపర్ పద్మ విషయంలో రజినీను తప్పు పట్టిన డైరెక్టర్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×