E-Paper
Advertisement

Prashant Kishor: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

Prashant Kishor: బీహార్ ఎన్నికల రద్దుకు ప్రశాంత్ కిశోర్ పిటిషన్.. ప్రజలు తిరస్కరిస్తే.. కోర్టులకు వస్తారా? సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Advertisement

Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న కీలక విచారణ చేపట్టింది. 2025 నవంబర్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో భారీస్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని, మహిళా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార యంత్రాంగం నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్నికలను రద్దు చేయాలని జన సురాజ్ పార్టీ కోరింది. అయితే, ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో పార్టీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

ఎన్నికల షెడ్యూల్ వెలువడి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమల్లో ఉన్న సమయంలో బీహార్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ (MMRY) కింద మహిళా ఓటర్ల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున నగదు బదిలీ చేసిందని ప్రశాంత్ కిశోర్ తన పిటిషన్‌లో ఆరోపించారు. సుమారు 35 లక్షల మంది మహిళలకు ఈ విధంగా నగదు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇది ఎన్నికల అక్రమమేనని వాదించారు. దాదాపు ₹15,600 కోట్ల రూపాయలను ఎన్నికల ముందు ఉచితాలుగా పంచడం వల్ల రాజకీయ పార్టీల మధ్య సమాన అవకాశాలులేకుండా పోయాయని ఫిర్యాదు చేశారు.

Advertisement

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జన సురాజ్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత, ప్రజాదరణ పొందేందుకు న్యాయస్థానాలను వేదికగా ఉపయోగిస్తారా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మొత్తం రాష్ట్ర ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరడం సరైన విధానం కాదని హితవు పలికింది. ఉచితాల పంపిణీ అనేది తీవ్రమైన అంశమే అయినప్పటికీ, ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని పార్టీ ఈ విషయాన్ని కోర్టుకు తీసుకురావడంపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది.

అయితే ఈ అంశం కేవలం బీహార్ రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి, ఈ ఫిర్యాదును పాట్నా హైకోర్టులో దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను రద్దు చేయాలని కోరే బదులు, నిర్దిష్టమైన నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలపై ఎలక్షన్ పిటిషన్ వేయాలని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు విముఖత చూపడంతో జన సురాజ్ పార్టీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. 2025 బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాలతో విజయం సాధించగా, ఇండియా కూటమి 35 స్థానాలను గెలుచుకుంది. జన సురాజ్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

Advertisement

Read Also: MLA defection case: ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్.. మూడు వారాలు వెనక్కి.. న్యాయస్థానంలో ఏం జరిగింది?

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×