E-Paper
Advertisement

Drivers Strike: ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె.. జాగ్రత్త పడకుంటే కష్టమే!

Drivers Strike: ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె.. జాగ్రత్త పడకుంటే కష్టమే!

Drivers Strike: ఓలా, ఉబర్, రాపిడో, పోర్టర్ సేవలపై నగరవాసులు పెద్ద ఎత్తున ఆధారపడుతున్నారు. స్కూల్, కాలేజీ, ఆఫీసు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా పలువురు ఈ రైడ్ హెయిలింగ్ ఫ్లాట్ ఫామ్స్ నే ఆశ్రయిస్తున్నారు. అయితే అటువంటి వారికి యాప్ ఆధారిత అగ్రిగేటర్ సేవల డ్రైవర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రేపు (ఫిబ్రవరి 7) దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఫలితంగా శనివారం రోజున ఓలా, ఉబర్, రాపిడో సేవల్లో అంతరాయం ఏర్పడనుంది.

బంద్‌కు ఎవరు పిలుపు ఇచ్చారు?

తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), జాతీయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు కలిసి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. TGPWU ప్రతినిధి మాట్లాడుతూ ‘యాప్ ఆధారిత రవాణా కార్మికులు ఫిబ్రవరి 7న అఖిల భారత స్థాయిలో సమ్మెకు దిగబోతున్నారు. మా డిమాండ్లపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి’ అని పిలుపునిచ్చారు.

అసలు సమ్మె ఎందుకు?

ఓలా, రాపిడో, ఉబర్, పోర్టర్ వంటి కంపెనీలు.. ఆటోలు, క్యాబ్స్, బైక్ రైడ్ల కోసం నిర్ణయించే ఛార్జీల విధానంపై ఎప్పటినుంచో డ్రైవర్లలో అసంతృప్తి ఉంది. దీని వల్ల డ్రైవర్లకు అస్థిర ఆదాయాలు ఉండటంతో పాటు దోపిడి, అధిక పని గంటలు ఉంటున్నట్లు యూనియన్నలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు యాప్ ఆధారిత కంపెనీలు తమ ఆదాయాన్ని రూ.కోట్లలో పెంచుకుంటుంటే.. డ్రైవర్లు మాత్రం సరైన రాబడి లేక పేదరికంలోనే మగ్గిపోతున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకొని కనీస బేస్ ఛార్జీలను ఖరారు చేయాలని యూనియన్లు కోరుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7న సమ్మెకు పిలుపునిచ్చాయి.

కేంద్ర రవాణా మంత్రికి లేఖ

మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు – 2025 అమలు చేయాలని కోరుతు TGPWU కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీకి ఇటీవల లేక రాసింది. యాప్ ఆధారిత రవాణా సేవల ఛార్జీలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అగ్రిగేటర్ కంపెనీలు ఏకపక్షంగా ఛార్జీలను నిర్ణయిస్తున్నాయని.. దీని వల్ల లక్షలాది మంది డ్రైవర్లు ఆదాయ భద్రత, దోపిడికి గురవుతున్నారని లేఖలో నితిన్ గడ్కరీకి తెలియజేశారు.

డ్రైవర్ల షరతులు ఏంటి?

క్యాబ్‌లు, ఆటోలు, బైక్ టాక్సీలు, ఇతర అగ్రిగేటర్ ఆధారిత సేవలతో సహా యాప్ ఆధారిత రవాణా సేవలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస బేస్ ఛార్జీలను వెంటనే ప్రకటించాలని యూనియన్లు డిమాండ్ చేశాయి. గుర్తింపు పొందిన డ్రైవర్లు, కార్మిక సంఘాలతో సంప్రదించిన తర్వాతే ఈ ఛార్జీలను ఖరారు చేయాలని పట్టుబడుతున్నారు. వాణిజ్య ప్రయాణాలు, వస్తు రవాణా కోసం ప్రైవేటు వాహనాల వాడకాన్ని నిషేధించాలని కోరుతున్నారు.

Also Read: Mumbai Crime: యువతిపై సామూహిక అత్యాచారం.. 16 మంది డీఎన్ఏ పరిశీలన.. నిందితుల్లో తండ్రి సైతం..!

రాష్ట్రాల వారీగా మారుతున్న డిమాండ్స్

అయితే అగ్రిగేటర్ యాప్ ఆధారిత డ్రైవర్ల డిమాండ్స్.. రాష్ట్రం, నగరాలను బట్టి మారుతున్నాయి. ముంబయి డ్రైవర్లు.. స్థిరమైన ఛార్జీలను డిమాండ్ చేస్తుండగా.. చెన్నై వారు మాత్రం యాప్ కంపెనీలు వసూలు చేస్తున్న కమీషన్ ను తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తుతం విధిస్తున్న 25-40 శాతం కమిషన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెుత్తంగా ఫిబ్రవరి 7న ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో.. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లోని వాసులు తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.

Also Read: Bengaluru Crime: దొంగతనం చేస్తూ చిక్కిన దొంగ.. కుమ్మేసిన ఇంటివాసులు, పోలీసులకు దొంగ ఫిర్యాదు

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×