E-Paper
Advertisement

Allu Arjun: ఘనంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!

Allu Arjun: ఘనంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Allu Arjun:ఎట్టకేలకు అల్లు కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే మొదటగా సాంప్రదాయంగా మొదలయ్యే హల్దీ వేడుకలను ఘనంగా ప్రారంభించారు అల్లు కుటుంబ సభ్యులు. అయితే ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా అధికారికంగా పంచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్టు పంచుకున్నారు అల్లు అర్జున్ (Allu Arjun). అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం..

ఘనంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక..

అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అయిన ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. అల్లు శిరీష్ తన స్నేహితురాలు నయానికా రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నారు. ఈ మేరకు ఆ ఇంట్లో హల్దీ వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తన తమ్ముడి జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టానికి అన్న అల్లు అర్జున్ హాజరు కాలేకపోయాడు. ప్రస్తుతం ఆయన అట్లీ సినిమా షూటింగ్ పనుల్లో దేశం వెలుపల బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ ఈ వేడుకకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్..

Advertisement

అందులో భాగంగానే అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. తమ్ముడి హల్దీ ఫోటోని, వీడియోని పంచుకుంటూ..”ఐ మిస్డ్ బీయింగ్ హియర్” (నేను అక్కడ ఉండాల్సింది కానీ మిస్ అయ్యాను) అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచారు. మొత్తానికైతే తన తమ్ముడి పెళ్లికి సంబంధించిన హల్దీ వేడుకల్లో తాను లేకపోవడాన్ని చాలా ఫీల్ అవుతున్నట్లు తెలియజేశారు అల్లు అర్జున్. ఇకపోతే అల్లు అర్జున్ ఈ వేడుకలో లేకపోయినా.. ఆయన భార్య స్నేహారెడ్డి , కూతురు అర్హతో పాటు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, రామ్ చరణ్ భార్య ఉపాసన తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మొత్తానికైతే అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

also read:Sai Pallavi: లెజెండ్రీ సింగర్ బయోపిక్ లో సాయి పల్లవి.. పాత్ర కోసం కఠిన శిక్షణ!

సినిమా షూటింగ్లో బిజీగా అల్లు అర్జున్..

Advertisement

అల్లు అర్జున్ విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఈయన, ఆ తర్వాత పుష్ప 2 సినిమా చేసి సంచలనం సృష్టించారు. ఈ సినిమాతో ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూల్ చేసిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించారు. ఇక ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ కారణంగానే తన తమ్ముడి హల్దీ వేడుకలకు ఆయన హాజరు కాలేకపోయారు. ఇకపోతే ఇప్పుడు ఆయన లేకపోవచ్చు కానీ త్వరలో జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్ కి మాత్రం అల్లు అర్జున్ తప్పకుండా హాజరవుతారని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మరి తమ్ముడి పెళ్లిలో బన్నీ సందడి ఎలా ఉండనుందో చూడాలి.

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×