E-Paper
Advertisement

Kolikapudi Controversy: రోడ్లు లేవు.. ఉద్యోగాలు రావు! ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Kolikapudi Controversy: రోడ్లు లేవు.. ఉద్యోగాలు రావు! ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వెనుక అసలు వ్యూహం ఇదేనా?
Advertisement

Kolikapudi Controversy: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా వరుసగా సోషల్ మీడియా స్టేటస్‌లతో సంచలనం సృష్టిస్తున్నారు. “పల్లెలు కన్నీరు పెడుతున్నాయి, రోడ్లు సరిగా లేవు, ఉద్యోగాలు రావడం లేదంటూ ఆయన పెట్టిన పోస్టులు నియోజకవర్గంలోను, పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ చర్యలతో ఆయన సొంత పార్టీతో తెగదెంపులకు సిద్ధమవుతున్నారా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా అసెంబ్లీ లాబీలో చోటుచేసుకున్న పరిణామంతో కొలికపూడి ఫ్యూచర్‌‌ ఏంటనేది ఆసక్తి రేపుతోంది.

నిత్యం వివాదాలలో కొలికపూడి శ్రీనివాస్

ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలి ముందు నుంచి వివాదాస్పదమే. కొలికపూడి శ్రీనివాస్​ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గతంలో చాలాసార్లు దూకుడుగా వ్యవహరించడం వల్ల పార్టీ అధిష్ఠానానికి చాలామంది ఫిర్యాదు చేశారు. ఒకానొక సమయంలో సీఎం చంద్రబాబు సైతం కొలికపూడి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్​-కొలికపూడి వ్యవహారం ఇంకా చంద్రబాబు దగ్గర నలుగుతోంది. ఒకటికి రెండు సార్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం వార్నింగ్ ఇచ్చినా ఆయన తన వ్యవహారశైలి మార్చుకోలేదు.

కొలికపూడి ఎమ్మెల్యే వాట్సప్‌ స్టేటస్.. పల్లె కన్నీరు హెచ్చరిక!

Advertisement

అది అలా కొనసాగుతుండగానే తాజాగా ‘పల్లె కన్నీరు పెడుతోందంటూ’ కొలికిపూడి సోషల్‌మీడియా పెట్టిన పోస్టును అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. సొంత పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టడం టీడీపీకి తలనొప్పిగా మారిందట. ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందని పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ కొలికపూడి పెట్టిన వాట్సప్‌ స్టేటస్‌ మరోసారి చర్చాంశనీయంగా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్‌లో మూడు రోజులపాటు 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుందని పెట్టిన స్టేటస్‌ స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఎమ్మెల్యే

ఇప్పటి వరకూ పార్టీలోని పరిస్ధితిని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టిన ఎమ్మెల్యే కొలికపూడి…ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా పోస్టులు పెట్టడంతో టీడీపీతో తెగతెంపులకు సిద్దమవుతున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుందట. రోడ్లు, ఉద్యోగాలంటూ సొంత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడం అందులో భాగమే అన్న టాక్ వినిపించింది. స్థానికుడు కాకపోయినా తక్కువ టైం ఉన్నా.. కూటమి వేవ్‌లో కొలికపూడి గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ… తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారారు.

దళిత నేతపై చర్యలు.. పార్టీకి సవాలు

Advertisement

కొలికపూడి వైఖరిని గమనిస్తున్న విశ్లేషకులు దీని వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ తనపై చర్యలు తీసుకుంటే, దానిని ‘దళిత నేతపై అణచివేత’గా చిత్రీకరించి సానుభూతి పొందాలని ఆయన భావిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. గతంలో కొలికపూడి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ కావడం, స్థానిక వైసీపీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయన త్వరలోనే పార్టీ మారతారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది పార్టీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక కేడర్‌ను నిర్మించుకోవాలని ఆయన చూస్తున్నారన్న చర్చ కూడా నియోజకవర్గంలో నడిచింది. సొంత పార్టీ ఎంపీ కేశినేని చిన్నితో ఉన్న గ్యాప్ … చివరకు పెరిగి పెద్దదవడంతో పార్టీ కూడా ఇరకాటంలో పడాల్సి వచ్చింది.

కొలికపూడి వ్యవహారాలపై టీడీపీ ఆగ్రహం

కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వ్యవహరిస్తున్న తీరుపై తిరువూరు టీడీపీ శ్రేణులతో పాటు పార్టీలో అందరూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు పేకాట శిబిరాలకు అడ్డాగా మారిందంటూ ఒకసారి పేకాటలో పట్టుబడ్డ వారి ఫోటోలను వాట్సప్ స్టేటస్‌గా పెట్టారాయన. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీకి డబ్బులిచ్చానంటూ మరోసారి స్టేటస్‌ పెట్టడం తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఆ క్రమంలో ఆయన వివాదాస్పద పోస్టులు పెట్టడం మానకపోతుండటంతో అధిష్టానం వేటు వేస్తుందన్న చర్చ గట్టిగానే జరిగినా.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కొలికపూడి సభలో ఆసక్తికర ఘటన..

తాజాగా ప్రభుత్వం మీదే నేరుగా ఎమ్మెల్యే ఆస్త్రాలు ఎక్కువ పెట్టడం చూస్తుంటే…. తెగతెంపులకు సిద్ధమవుతున్నారా అన్న డౌట్స్‌ పెరుగుతున్నాయని టీడీపీ నాయకులే ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటున్నారట. ఎంపీ టార్గెట్‌గా చేస్తున్న విమర్శల్ని పక్కన పెట్టి… ఇప్పుడు డైరెక్ట్‌గా సొంత ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తుండటంతో పార్టీ కూడా గుర్రుగా ఉందట. సీన్ కట్ చేస్తే కొలికపూడి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఆసక్తికకర ఘటన చోటు చేసుకుంది.

కొలికపూడి శ్రీనివాస్‌కు పల్లా శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. అసెంబ్లీ లాబీలో తారసపడిన కొలికపూడికి పల్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయం గుర్తించి ప్రవర్తించాలని హితవు పలికారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకెందుకు సీఎం సిద్ధంగా లేరని పల్లా తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు మందలించినా పద్దతి మార్చుకోకుండా తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతే పార్టీ కూడా ఎమ్మెల్యే గా గుర్తించటం మానేస్తుందని స్పష్టం చేశారు.

పార్టీ లైన్‌ను ఛాలెంజ్ చేసిన కొలికిపూడి

పిచ్చి పిచ్చి స్టేటస్‌లతో ఎవరిమీద నీ పోరాటం అని నిలదీశారు. ‘పల్లె కన్నీరు పెడుతోందంటూ’ ఇటీవల కొలికిపూడి పెట్టిన పోస్టును అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆ క్రమంలో పార్టీనే సుప్రీం అని, పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తుంటే ఉపేక్షించటానికి అధిష్టానం సిద్ధంగా లేదని పల్లా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అయితే అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని పల్లా ముందు కొలికిపూడి వివరణ ఇచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే కొద్ది సేపటికే అసెంబ్లీ లాబీ లో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వాయిస్ మారిపోయి, మళ్లీ రెబల్ అవతారమెత్తేశారు. సమస్యలు ఉన్నంతవరకు, నా స్టేటస్ లు ఆగవు, నా ట్వీట్ లు ఆగవని పేర్కొన్నారు.

కొలికపూడి ఎపిసోడ్‌కి అధిష్టానం ఏ కొత్త క్లైమాక్స్ రాసేంది?

గ్రామాల్లో రోడ్లు, వసతులు లేకపోవడంతో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలు ప్రజలు వైసీపీని తిట్టారని, రేపు తమను తిట్టకూడదనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు పల్లా తనకుకు క్లాస్ పీకారు అనేది అవాస్తవమని, నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి తాను సీఎంని కలిసానని, తన వాట్సాప్ స్టేటస్ లపై ఎవరు ఏమీ అడగలేదు, తానేమీ చెప్పలేదని పాత రూట్లోనే వెల్లడించారు. మరి చూడాలి కొలికపూడి ఎపిసోడ్‌కి అధిష్టానం ఎలాంటి క్లైమాక్స్ రాస్తుందో?

Also Read: బ్లాక్ బాక్స్ విప్పిన భయంకర నిజం.. టేకాఫ్ అయిన 32 సెకన్లకే అసలేం జరిగింది?

 Story by : Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×