Ambica Krishna:ఏళ్లుగా హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ పాతుకుపోయింది.ఇక ఉన్నపళంగా ఆంద్ర ప్రదేశ్ లో అడుగుపెట్టేయ్యాలంటే చాలా కష్టం.కానీ మీరు వచ్చి తీరాల్సిందే అంటూ ఆశ పడుతున్నాడు ఎఫ్‌డీసీ( ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ) మాజీ చైర్మన్, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ. అవును తాజాగా ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టిన అంబికా ఇక్కడే పుట్టారు, ఇక్కడే తిన్నారు, ఇక్కడే పెరిగారు..అలాంటిది ఇపుడు సొంత రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణా వంటి ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో విచ్చలవిడిగా షూటింగ్ చేయడమేంటి అంటూ తెలుగు హీరోలని ప్రశ్నించారు.
రియాలిటీకి వచ్చే సరికి ఎంత వరకు సాధ్యం
బాలయ్య ఎంచక్కా తను గోపీచంద్ మలినేని తో చేయబోయే సినిమా కోసం ఇక్కడే ముహుర్తం పెట్టేశాడు.ఇక మెజారిటీ షూటింగ్ కూడా ఇక్కడే చేస్తానంటున్నాడు.మీరు కూడా ఆంద్ర ప్రదేశ్ లోనే సినిమాలు చేసుకుంటే నెలలో 20రోజులు షూటింగ్ చేస్తే రోజూ 4,5 వేల మందికి ఉపాధి దొరుకుతుంది కదా అన్నది వారి వాదన. నిజానికి అంబికా వారి మాటల్లో అర్థం ఉంది కూడా.పుట్టిన గడ్డకి ఋణం తీర్చుకుంటే బాగుంటుంది అన్నదాంట్లో నిజం ఉంది కూడా.కాని పేపర్ మీద వేసిన లెక్కలు రియాలిటీకి వచ్చే సరికి ఎంత వరకు సాధ్యం అవుతాయన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.
సాహసం చేస్తారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్
మేకర్స్ ఈ మధ్య రాస్తున్న కథలన్నీ ఎక్కువగా పారిన్ బ్యాక్ డ్రాప్ లోనే.అంటే ఆ సీన్స్ ని అమరావతిలోనో, అమలాపురం లోనో తీయడం అస్సలు కుదరదు.ఇక హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ వంటి అధునాతన స్టూడియోలు, ఇక్కడ మంచి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ తో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయి ఉన్నాయి, మన హీరోలు ఇక్కడ దగ్గర ఉన్నటు వంటి స్టూడియో లని వదిలి దూరంగా ఉన్న ఆంద్రకి వస్తారా అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్,పైగా ఇలాంటి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అక్కడ ఉందా అంటే అనుమానమే ,అంబికా వారు అన్నట్టుగా రామారావు , నాగేశ్వరావు వంటి అలనాటి ఎంతో మంది తారలు ఆంద్రలో షూటింగ్స్ చేసి అక్కడ అంతో ఇంతో సినిమా పాతుకుపోవడానికి బాగానే కృషి చేశారు,కానీ అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు.ఏదైనా,ఎలాంటి లొకేషన్ అయినా నిమిషాల్లో ఇక్కడ స్టూడియోలలో రెడీ అయిపోతుంది.అలాంటిది తమ కంఫర్ట్ జోన్ ని వదిలి హీరోలు అక్కడకి వెళ్ళే సాహసం చేస్తారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
రెండు అవార్డుల మధ్య పంచాయితీ?
ఇక ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో ఆంద్రా యాస అసలు కనబడట్లేదని,మొత్తం తెలంగాణా మాండలికాలతో నింపేస్తున్నారని వాపోయారు.ఇక్కడ గమ్మత్తు అయిన విషయం ఏంటంటే సినిమాల్లో మొత్తం ఆంద్రా యాసనే ఉంటుందని,తెలంగాణ లో ఉంటూ ఇక్కడి భాష ని అవమానిస్తున్నారు అన్నది తెలంగాణ వారి వాదులు ఎన్ని సార్లు ఎలా రెచ్చిపోయారో మనం చూశాం కూడా.అయితే వీటన్నింటిలో ఆయన లేవనెత్తిన వాటిలో మళ్ళీ నందులని తిరిగి ఇవ్వాలని కోరిన కోరికే ప్రస్తుతం నెరవేరెట్టు కనిపిస్తుంది.తాజాగా ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నియమించడం కూడా అందుకు కారణం కావొచ్చు.మరి ఈ నందులు గద్దర్ అవార్డు వచ్చిన సినిమాలకే మళ్ళీ ఇస్తారా లేక మళ్ళీ కొత్తగా సెలెక్ట్ చేసి రెండు అవార్డుల మధ్య పంచాయితీకి శ్రీకారం చుడతారా చూడాలి !
also read:‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!
ఏది ఏమైనా ఇక్కడ ఓట్లు వేస్తూ, విదేశాల్లో సినిమా షూట్లు ఎందుకు ఇక్కడికి వచ్చేయండి అంటున్న అంబికా వారి ఆశలు,ఆశయాలు బాగానే ఉన్నాయి కాని అసలు అవి ఇప్పట్లో తీరతాయా,అందుకు ఇప్పుడున్న పరిస్థితులు సహకరిస్తాయా అంటే అనుమానమే !