Irumudi Release: రవి తేజ ..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబడొచ్చు అని ప్రూవ్ చేసిన మాస్ మహారాజ్.అలాంటి ఈ హీరోకి అ ఇపుడు అస్సలు కాలం కలిసి రావట్లేదు. రీసెంట్ హిట్ ఏదంటే అప్పుడెప్పుడో 2022లో వచ్చిన దమాకా సినిమానే ఇంకా రివైండ్ వేయాల్సిన పరిస్థితి.ఆ ఏడే వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ కాని, ఆ తర్వాత వచ్చిన రావణాసుర,టైగర్ నాగేశ్వరరావు సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి.అయితే ఉన్నంతలో వాల్తేరు వీరయ్య తో హిట్ ట్రాక్ ఎక్కాడనిపించుకున్నా అది కాస్తా చిరు ఖాతాలోకి పోయిన పరిస్థితి.
ఇక ఆ తర్వాత ఇవన్నీ నాకు కామనే అంటూ మళ్ళీ ఈగల్, మాస్ జాతర అంటూ చేసిన సినిమాలు చేసినట్టే పోయాయి.ఈ ఏడు పొంగల్ బరిలోకి భర్త మహాశయులకి విజ్ఞప్తి సినిమా సూపర్ హిట్ మహాప్రభో అంటూ మేకర్స్ ఎంత అరిచి గీ పెట్టిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ అయిందో కలక్షన్స్ చూస్తేనే అర్థం అవుతుంది.
also read:యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?
మలయాళ సూపర్ హిట్ “మాలికప్పురం (Malikappuram) ఫ్రీమేక్ ?
దీంతో ఇక ఇలా కాదంటూ రొటీన్ కి కాస్త భిన్నంగా వెళ్తానంటూ శివ నిర్వాణ చెప్పిన ఇరుముడి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మన మాస్ మహారాజ.అయితే ఇదే కథని పట్టుకొని నాగ చైతన్య చుట్టూ తిరిగినప్పటికీ డేట్స్ చైతు అడ్జెస్ట్ చేయలేకపోయాడా,లేక కథ నచ్చలేదో తెలీదు కాని మొత్తానికి రవి తేజ ఆన్ బోర్డ్ అయ్యాడు.ఇక సినిమా 2022లో విడుదలైన మలయాళ సూపర్ హిట్ “మాలికప్పురం (Malikappuram)అనే ఫ్రీమేక్ అని సినిమాకి అన్ అఫీషియల్ టాక్ కూడా చక్కర్లు కొడుతుంది,ఇక సినిమాలో రవితేజ అయ్యప్ప మాల వేసుకున్నట్టుగా ఉన్న దృశ్యాలు, వెంట పాప కూడా ఉండటం వాటికి బలాన్ని చేకూర్చుతుంది కూడా.కాని మేకర్స్ నుండే క్లారిటీ రావాలి.
సెప్టెంబర్ 11న బరిలోకి దించేలా ప్లాన్ చేస్తున్న మేకర్స్
ఇక ఇవన్నీ ఇలా ఉండగా యమా జోరుగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాని మొదటగా ఆగస్ట్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ప్లాన్ చేసుకున్న నిర్మాతలు ఇపుడు మనసు మార్చుకున్నట్టే కనిపిస్తుంది.అవును..ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ 11న బరిలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.అయితే దీనికి ప్రధాన కారణం సినిమా షూటింగ్ స్పీడ్ గానే జరుగుతున్నా టెక్నికల్ గా చాలా స్లో ఉందని, ముఖ్యంగా సినిమాలోని సీజీ,గ్రాపిక్ పనుల్లో గ్లిచెస్ వస్తున్నాయని టాక్.ఇక ఇందులో ఆధ్యాత్మిక అంశాలు వంటివి ఎక్కువగా ఉండటం వల్ల సినిమా గ్రాఫిక్స్ పరంగా ఏమాత్రం తేడా కొట్టినా జనాలు ఆడుకుంటారని శివ భయం కాబోలు.
ఎలాంటి ఎలా అడ్డుకట్ట వేస్తారో !
ఇక దీనికి తోడు టాక్సిక్ కూడా ఆగస్ట్ లో వచ్చే అవకాశం ఉండటం కూడా ఈ వాయిదాల పాటకి కారణం అని వినిపిస్తుంది.అసలే kgf 2 తర్వాత వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ,దీనికి తోడు నేషనల్ వైడ్ గా యష్ కున్న క్రేజే ఏంటో చెప్పక్కర్లేదు.ఇలాంటి సమయంలో పోటీగా వచ్చి బోల్తా కొట్టడం కన్నా వెనక్కి వెళ్లి హిట్ కొట్టడం మంచిదని మేకర్స్ ఈ డిసీషన్ తీసుకున్నారని ఇన్ సైడ్ టాక్.
చూడాలి మరి జోరుగా సాగుతున్న ఈ ప్రచారానికి మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి ఎలా అడ్డుకట్ట వేస్తారో !