E-Paper
Advertisement

ఎట్టకేలకు సర్జరీపై స్పందించిన అమితాబ్ బచ్చన్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!

ఎట్టకేలకు సర్జరీపై స్పందించిన అమితాబ్ బచ్చన్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!
Advertisement

Amitabh Bachchan:గత 2 రోజులుగా బాలీవుడ్ బిగ్ బి సర్జరీ చేయించుకున్నారని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని, సర్జరీ సమయంలో తాను పడ్డ ఇబ్బందులను అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. దీంతో అమితాబ్ బచ్చన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయనకు ఏమైంది? ఎప్పుడు సర్జరీ చేశారు? ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నారు ? అంటూ అభిమానులు కూడా ఆందోళన పడ్డారు. అయితే ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న వార్తలపై ఆయనే స్వయంగా స్పందించి, ఆ రూమర్స్ ని కొట్టి పారేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సర్జరీ రూమర్స్ పై స్వయంగా స్పందించిన అమితాబ్..

తాజాగా తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు అమితాబ్ బచ్చన్ స్పందించారు. “నాకు ఎలాంటి శస్త్ర చికిత్స జరగలేదు. ప్రస్తుతం నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. కాకపోతే ఇటీవల అర్జెంటీనా – స్పెయిన్ ఫిఫా మ్యాచ్ సందర్భంగా ఛాంపియన్ జట్టు ఓటమి తర్వాత మళ్లీ పుంజుకోవడం ఎంత కష్టమో వివరించే క్రమంలో ఐసీయూ , సర్జరీ వంటి పదాలను ఉదాహరణగా ఉపయోగించాను. అయితే ఆ వ్యాఖ్యలు చాలామంది నా ఆరోగ్య పరిస్థితికి సంబంధించినవిగా అర్థం చేసుకొని.. సోషల్ మీడియాలో పలు ఊహాగానాలను ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

Advertisement

ALSO READ:వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ఓజీ.. 28 ఏళ్ల తర్వాత అలాంటి రికార్డ్!

వార్తలలో నిజం లేదు – అమితాబ్ బచ్చన్..

నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు. ప్రస్తుతం నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దయచేసి ఆ వార్తలను నమ్మకండి. త్వరలోనే కల్కి సీక్వెల్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నాం” అంటూ అమితాబ్ బచ్చన్ ప్రకటించడంతో అభిమానుల సందేహాలు కాస్త తొలగిపోయాయని చెప్పాలి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లన్నింటికీ కూడా స్వయంగా ఆయనే వివరణ ఇవ్వడంతో చెక్ పడింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమితాబ్ బచ్చన్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే?

Advertisement

ఇకపోతే అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై వైరల్ అయిన వార్త విషయానికి వస్తే.. సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇదే చాలా కష్టమైన దశ.. శారీరకంగా, మానసికంగా, చాలా ప్రాక్టికల్ గా ఇది నరకం చూపిస్తోంది. మీరు ఎంతటి గౌరవనీయమైన ఛాంపియన్ అయినా.. ఒకరోజు ఓటమి మిమ్మల్ని పలకరిస్తుంది. ఇది జీవితంలో అత్యంత కష్టమైన ఘట్టం. కొంతమంది ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తే.. ఇంకొంతమంది గత తాలూకా జ్ఞాపకాలలోనే ఉండిపోతారు. ఎవరైతే చివరి వరకు పోరాడతారో వారు ఎప్పటికీ ఛాంపియన్లుగా మిగులుతారు ” అంటూ రాసుకు వచ్చారు. దీంతో అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం బాగోలేదని , అందుకే ఆయన సర్జరీ చేయించుకున్నారని, సర్జరీ తర్వాత ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇలా రాసుకు వచ్చారు అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే అమితాబ్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.

Related News

“నా గురువే నా రైడర్”.. కీరవాణితో రాహుల్ సిప్లిగంజ్ ‘ఫుల్ సర్కిల్’ మోమెంట్!

బాలయ్య బాబు హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. క్లారిటీ వచ్చేసింది!

మలైకా గ్లామర్ దెబ్బకు తడబడ్డ పెద్దాయన…పరిస్థితి చూస్తే నవ్వు ఆగదు!వైరల్ వీడియో

రెండు నిమిషాల రోల్ కోసం ఆ స్టార్ హీరోయిన్.. వంగా ‘స్పిరిట్’ స్పెషల్ ట్విస్ట్!

దేవుళ్లతో విజయ్, త్రిష పోలికా? రచ్చ ఎక్కిన ఫ్లెక్సీ వివాదం!

చీరకట్టు.. సిగరెట్.. మద్యం! ఆ ఇమేజ్ నుంచి బయటపడిన బాలీవుడ్ బ్యూటీ !

ఢిల్లీ ఘర్షణల వెనుక కుట్ర కోణం ఉందా? నటుడు నరేష్ పోస్ట్ వైరల్

Big Stories

Advertisement
×