Ujaas eGo Li Electric Scooter: గత కొంత కాలంగా మార్కెట్ లోకి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు ఈ స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. రూ. 50,000 లోపు ధరతో మంచి రేంజ్ ఇచ్చే ఈవీలను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురావడంలో ఉజాస్ ఎనర్జీ సంస్థ ముందుంది. ఈ సంస్థ తీసుకొచ్చిన ఈగో లి అనే ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. తక్కువ వేగంతో వెళ్లే ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ కు లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ఇది ఛార్జ్ కు 75 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.
⦿ బ్యాటరీ: 1.5 kWh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
⦿ పరిధి: ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ మీద సుమారు75 కి.మీ ప్రమాణించే అవకాశం ఉంటుంది.
⦿ ఛార్జింగ్ సమయం: బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 3-4 గంటలు పడుతుంది.
⦿ మోటార్: ఈ స్కూటర్ లో 250 W BLDC హబ్ మోటార్ ఉంటుంది.
⦿ గరిష్ట వేగం: ఈ స్కూటర్ గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
⦿ బ్రేకులు: ఈ స్కూటర్ కు ముందు, వెనుక డ్రమ్ బ్రేక్ లు ఉంటాయి.
⦿ టైర్లు: రెండు అల్లాయ్ వీల్స్ తో ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉంటాయి.
⦿ ఫీచర్లు: ఉజాస్ ఈగో లి ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిజిటల్ స్పీడోమీటర్, LED లైటింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, రివర్స్ గేర్, USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఫీచర్లు ఉంటాయి.
Read Also: ఏథర్ రిజ్టా vs హోండా యాక్టివా ఇ.. వీటిలో ఏది కొంటే బెస్ట్?
⦿ ధర: ఉజాస్ ఈగో లి ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ. 50,880 నుంచి రూ. 60,774 వరకు ఉంటుంది. ఇది స్టాండర్డ్ (STD), లి అయాన్ వెర్షన్ (eGo Li) వేరియంట్లలో లభిస్తుంది. లి అయాన్ వెర్షన్ ధర సాధారణంగా రూ. 50,880 నుంచి రూ. 60,774 మధ్య ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన లెడ్ యాసిడ్ వెర్షన్ ఉజాస్ ఈగో లా రూ. 40,000 కంటే తక్కువ ధరతో లభిస్తుంది.
Read Also: 8 సెకెన్లలో 40 కిమీ వేగం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మామూలుగా ఉండదు భయ్యా!
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రోజువారీ నగర ప్రయాణానికి అనువుగా ఉంటుంది. మంచి లుక్, లేటెస్ట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. సిల్వర్, గోల్డ్ కలర్స్ తో అందుబాటులో ఉంటుంది. తక్కువ దూర పట్టణ ప్రయాణాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.
Read Also: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు గుడ్ న్యూస్, జస్ట్ 34 వేలకే క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!