E-Paper
Advertisement

ఎపిక్ టీజర్ రిలీజ్ ..లిప్ కిస్లతో రెచ్చిపోయిన ఆనంద్ దేవరకొండ..

ఎపిక్ టీజర్ రిలీజ్ ..లిప్ కిస్లతో రెచ్చిపోయిన ఆనంద్ దేవరకొండ..
Advertisement

Epic Teaser: బేబీ సినిమాతో హిట్ జోడిగా నిలిచిన ఆనంద దేవరకొండ వైష్ణవి చైతన్య మరోసారి వెండి తెరపై జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవి చైతన్య ఆనంద దేవరకొండ హీరో హీరోయిన్లుగా ఎపిక్(Epic) ఫస్ట్ సెమిస్టర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.90s, ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోని తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు. ఈ టీజర్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 90 s వెబ్ సిరీస్(90s web series) లోని ఆదిత్య పాత్ర పెద్దయిన తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి చేయడం యూకేకి వెళ్లి అక్కడ అమ్మాయితో ప్రేమలో పడటం వల్ల ఏం జరిగింది కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ముద్దు సన్నివేశాలతో టీజర్..

ఇక ఈ సినిమా టీజర్ చూస్తుంటే అమ్మాయిలు అంటే మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడే ఆదిత్య ఏకంగా ఒక అమ్మాయిని ప్రేమలో పడేస్తారు అయితే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) తల్లితండ్రులుగా శివాజీ(Sivaji), వాసుకి ఆనంద్(Vasuki Anand) నటించిన. ఇక ఈ టీజర్ వీడియో మొత్తం రొమాంటిక్ సీన్లతో లిప్ కిస్ సీన్లతో ఉందని చెప్పాలి. ఈ టీజర్ చూస్తుంటే బేబీ సీక్వెల్ సినిమా రాబోతోందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆనంద్ వైష్ణవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ..

Advertisement

ఆనంద దేవరకొండ వైష్ణవి చైతన్య మరో లవ్ రొమాంటిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నాగ వంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర బృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉంది. ఇక ఆనంద్ దేవరకొండ ఇటీవల కాలంలో విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Advertisement

ఇక వైష్ణవి చైతన్య సైతం యూట్యూబర్ గా తన ప్రయాణం మొదలు పెట్టీ అనంతరం పలు వెబ్ సిరీస్ లలో నటించారు. ఇలా వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమస్ అయిన ఈమె బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆనంద్ దేవరకొండ తో కలిసి బేబీ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్యకు మొదటి సినిమానే మంచి సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో వైష్ణవి చైతన్య నటించిన ఈ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె ఎపిక్ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బేబీ తరహాలోనే వెండితెరపై ఈ జంట మరోసారి మ్యాజిక్ చేస్తూ సక్సెస్ అందుకుంటారా? లేదా అనే విషయాలు తెలియాల్సిందే.

Also Read: పెద్ది సినిమాలో మూడు విభిన్న పాత్రలలో చరణ్… అసలేం ప్లాన్ చేస్తున్నావ్ బుచ్చి!

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×