E-Paper
Advertisement

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!
Advertisement

Epic Movie Trailer: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆనంద దేవరకొండ(Anand Devarakonda) త్వరలోనే ఎపిక్(Epic) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)తో కలిసి మరోసారి ఆనంద్ దేవరకొండ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో వరుసగా సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయింది.

సినిమాలోనే మ్యాజిక్ ఉంది..

ఈ ట్రైలర్ మొదలవుతూనే.. నా పేరు ఆదిత్య నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది సినిమాలో మ్యాజిక్ ఉంది.. మంచి సినిమా మన సినిమా మన గురించి సినిమా చేయాలని ఉంది అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అయితే సినిమాలంటే ఆసక్తి ఉన్న ఆదిత్య ఉన్నత చదువుల కోసం లండన్ పంపిస్తారు అక్కడ తనకు వైష్ణవి చైతన్య పరిచయం కావడం ఇద్దరు ప్రేమలో పడటం, అనంతరం బ్రేకప్ చెప్పుకోవడం వంటి సన్నివేశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది . నేను అంత రొమాంటిక్ కాదు అంటూనే వైష్ణవి చైతన్య రొమాంటిక్ సన్నివేశాలు ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి.

బ్రేకప్ అంటే బ్లేమ్ చేయటం కాదు..

Advertisement

ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పుకోవడం బ్రేకప్ చెప్పడం అంటే తిట్టుకుంటూ ఎవరో ఒకరిని బ్లేమ్ చేయటం కాదు, నుదుటిపై కిస్ పెట్టి ,హగ్ చేసుకుని బ్రేకప్ చెప్పాలి అంటూ వచ్చే డైలాగ్స్ హైలెట్ అయ్యాయి.ఒక ప్రేమకథ.. లెక్కలేనన్ని భావోద్వేగాలు.. పూర్తికాని ఓ అధ్యాయం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ట్రైలర్ మంచి అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాతో వీరిద్దరూ బేబీ రేంజ్ హిట్ అందుకుంటారని స్పష్టం అవుతుంది.90స్‌ వెబ్‌సిరీస్‌ కి కొనసాగింపుగా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించారు. లో లండన్‌ లో కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథకు భావోద్వేగాలు, స్నేహం, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఏంటి అని నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ మంచి ఆదరణను సొంతం చేసుకుంటుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో ఆనంద దేవరకొండ తల్లిదండ్రులుగా నటుడు శివాజీ, వాసుకి నటించారు. మరి 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎపిక్ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం మంచి అంచనాలను పెంచేశాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

Also Read: అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×