The Paradise:దసరా ..శ్రీకాంత్ ఓదెల ,నాని కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా .దీంతో వీరి కాంబోలో వస్తున్న ప్యారడైజ్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.ఇక వరుస అప్ డేట్స్ చూస్తుంటే నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సినిమా అంటూ లెక్కలు మొదలైపోయాయి.
‘దసరా’ హిట్ అయింది కాబట్టి అదే కాంబినేషన్ మళ్లీ వస్తే సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుందని ఫిక్స్ అయిపోవడం కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ లాగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ వెనుక ఉన్న మ్యాజిక్‌ను మరోసారి అదే విధంగా రిపీట్ అవుతుందా అంటే అనుమానమే.
‘దసరా’లో కథ, పాత్ర, బ్యాక్‌డ్రాప్ అన్నీ కలిసి వచ్చాయి .ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో ఏం కొత్తగా చూపించబోతున్నారన్నదే అసలు ప్రశ్న.
ఇప్పటివరకు బయటకు వచ్చిన లుక్స్ చూస్తే నాని ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. విజువల్స్ కూడా భారీగానే ఉన్నాయి. టీజర్ కూడా ఒక రేంజ్‌లో కట్ చేశారు. పాటలు కూడా వచ్చేశాయి. ముఖ్యంగా ‘యేష నాగుల’ పాట సోషల్ మీడియాలో హడావుడి చేసింది. ఇవన్నీ చూసి సినిమా సూపర్ హిట్ చెప్పడం తొందరపాటే .
ఎందుకంటే టీజర్ అంటే రెండు నిమిషాలు. పాట అంటే నాలుగు నిమిషాలు. కానీ సినిమా అంటే రెండు గంటలకు పైగానే. ఆ రెండు గంటల కథలో ప్రేక్షకుడిని పట్టుకుని కూర్చోబెట్టేంత కంటెంట్ ఉందా? అనేదే అసలు మ్యాటర్
ఇప్పుడు ట్రైలర్ వర్క్స్ మొదలయ్యాయన్న వార్త బయటకు వచ్చింది. నిజానికి ట్రైలర్ ఈ సినిమాకు ఎంతో ముఖ్యంఇప్పటివరకు మేకర్స్ ఏం చూపించకుండా ‘ఏదో ఉందన్న బిల్డప్ అయితే ఇచ్చారు .
కనీసం ట్రైలర్‌లో అయినా కథకు సంబంధించి క్లారిటీ ఇస్తారా? లేక మరోసారి నాలుగు యాక్షన్ షాట్లు, నాని ఇంటెన్స్ లుక్, ఒక పవర్‌ఫుల్ డైలాగ్, చివర్లో బీజీఎమ్‌తో చేతులు దులుపుకుంటారా? అనేది చూడాలి.
ఇలాంటి ట్రైలర్లను ప్రేక్షకులు ఇప్పుడు చాలా చూసేశారు. హీరో పరుగెత్తడం.. విలన్ వైపు చూడటం.. చేతికి రక్తం.. వెనుక నుంచి భారీ బీజీఎమ్.. . ‘ది ప్యారడైజ్’ కూడా అలాంటి ట్రైలర్‌తో వస్తే మాత్రం మీమర్స్ కి మాంచి స్టఫ్ అవడం పక్కా .
ఇక నాని విషయానికి వస్తే.. ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో తన మార్కెట్‌ను నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా ‘సరిపోదా శనివారం’లో యాక్షన్‌ను కూడా బాగానే హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో ఇంకా అంతకు మించిన స్టఫ్ డెలివర్ చేయాలి .కథలో దమ్ము లేకపోతే మాత్రం ఆ మాస్ యాటిట్యూడ్ రెండు పాటలు, మూడు ఫైట్‌లకే పరిమితమైపోవడం ఖాయం.
మరోవైపు శ్రీకాంత్ ఓదెలపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ‘దసరా’తో ఒక్క సినిమాతోనే తనకంటూ ఓ బ్రాండ్ తెచ్చుకున్నాడు. అదే ఇప్పుడు ఆయనకు ప్లస్ కంటే మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దసరా’లో ఉన్న రా ఫీల్‌ను మళ్లీ చూపిస్తే ‘రిపీట్’ మోడ్ లో ఆడియన్స్ చూస్తారు .దానికంటే భిన్నంగా ఉంటె అంతేసంగతులు .
Also read :రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!
ఇందులో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పుడు పాత్రలు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. లేదంటే స్టార్ క్యాస్టింగ్ అంతా పోస్టర్లకే పరిమితమైపోయిందన్న కామెంట్లు రావొచ్చు కూడా,చూడాలి వచ్చే సెప్టెంబర్ 24న సినిమా ఎలాంటి మ్యాజిక్ చేయనుందో !