E-Paper
Advertisement

ఫైనల్లీ వైష్ణవి చైతన్యతో రిలేషన్ పై ఆనంద్ క్లారిటీ.. అన్న వదిననే ఫాలో అవుతున్నాడుగా?

ఫైనల్లీ వైష్ణవి చైతన్యతో రిలేషన్ పై ఆనంద్ క్లారిటీ.. అన్న వదిననే ఫాలో అవుతున్నాడుగా?
Advertisement

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఆనంద దేవరకొండ త్వరలోనే ఎపిక్ (Epic)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ జోడిగా మరోసారి వైష్ణవి చైతన్య నటించిన సంగతి తెలిసిందే. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మేం మంచి ఫ్రెండ్స్ మాత్రమే..

ఇక మరోసారి జంటగా ఎపిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు కాబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా విడుదలకు కేవలం ఒకరోజు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు వైష్ణవి చైతన్యతో రిలేషన్షిప్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ ప్రశ్నకు ఆనంద్ స్పందిస్తూ వైష్ణవి చైతన్యతో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకున్న విధంగా మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపారు . మేమిద్దరం కలిసి రెండు సినిమాలు చేయటం వల్ల మంచి ఫ్రెండ్స్ అయ్యామని తెలిపారు.

ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి..

Advertisement

ఇక పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ తనకు ఇంట్లో పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఉంది కానీ ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని తెలిపారు. అందరూ అనుకున్నట్టు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు గతంలో అన్నయ్య వదిన గురించి ఇలాంటి రూమర్స్ వచ్చాయి కానీ మా గురించి మాత్రం వచ్చే రూమర్లలో నిజం లేదని తెలిపారు. మేము మంచి ఫ్రెండ్స్ అని తమ రిలేషన్ పై ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.

దేవరకొండ ఇంటి కోడలుగా వైష్ణవి..

గతంలో కూడా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రష్మిక (Rashmika)గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎన్నో వార్తలు వచ్చాయి కానీ వీరు మాత్రం ఎక్కడ స్పందించలేదు పెళ్లి రెండు రోజులు ఉండగా వీరు పెళ్లి గురించి ప్రకటించారు. అచ్చం తన అన్నయ్య వదిన అలాగే ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా రెండు సినిమాలలో నటించారు అలాగే ఆనంద్ దేవరకొండ ఇంట్లో జరిగే వేడుకలలో వైష్ణవి చైతన్య సందడి చేస్తున్నారు దీంతో ఈమె కూడా దేవరకొండ ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలను ఖండిస్తూ ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా వీరిద్దరి రిలేషన్ గురించి వచ్చే రూమర్లు ఆగుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఆటో రాంప్రసాద్ కు ఓటు వేయద్దు.. ఫాన్స్ కు రిక్వెస్ట్ అంత పగేంటి ఉప్పల్ బాలు!

Related News

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

Big Stories

Advertisement
×