Uppal Balu: ఉప్పల్ బాలు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తన వీడియోలతో హల్చల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఉప్పల్ బాలు (Uppal Balu)తాజాగా అరియానా(Ariyana)తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు . ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల అయింది ఇందులో భాగంగా ఉప్పల్ బాలు అగ్ని పరీక్ష అలాగే బిగ్ బాస్ 10 కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఉప్పల్ బాలు కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా అగ్నిపరీక్ష (Agnipariksha)కార్యక్రమానికి ఎంపికయ్యారు. అయితే మొదటి రౌండ్ లోనే ఉప్పల్ బాలు అగ్నిపరీక్ష నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే . ఇలా అగ్నిపరీక్ష కార్యక్రమం నుంచి ఎలిమినేట్ కావడంతో ఉప్పల్ బాలు జ్యూరీ మెంబర్ అయినటువంటి నవదీప్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇకపోతే తాజాగా అరియానా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నలుగురు ఫేవరెట్ కంటెస్టెంట్ల గురించి చెప్పమని ఈ ప్రోమో వీడియోలో ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు బాలు సమాధానం చెబుతూ ఆటో రాంప్రసాద్(Auto Ramprasad) కు ఎవరు కూడా ఓటు వేయొద్దు అంటూ తన అభిమానులకు రిక్వెస్ట్ చేశారు . వాడు ఒక వేస్ట్ ఫెలో అంటూ ఆటో రాంప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తనకు ఇండస్ట్రీలో ముగ్గురు పెద్ద శత్రువులు ఉన్నారని చెప్పారు .ఒకటి ఆటో రాంప్రసాద్ రెండు పల్లవి ప్రశాంత్ కూడా నాకు శత్రువు అని తెలిపారు. పల్లవి ప్రశాంత్ నా వెనుక నా బ్యాగులు మోసుకుంటూ తిరిగేవాడు అని ఉప్పల్ బాలు తెలిపారు. ఉప్పల్ బాలుకు నచ్చని ఇంకొక వ్యక్తి ఎవరు అనేది తెలియాలి అంటే పూర్తి ఇంటర్వ్యూ విడుదల అయ్యేవరకు ఎదురు చూడాలి. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాలని కోరిక ఎంతగానో ఉన్నప్పటికీ ఆ కల నెరవేరకపోవడంతో బాలు ఎమోషనల్ అయ్యారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా నవదీప్ అడిగిన విధంగానే అరియానా కూడా నిజంగానే నీకు ఫ్యాన్స్ ఉన్నారా అంటూ ప్రశ్న వేశారు.
?stkn=MzJqMnQycXd6YTBm
ఈ ప్రశ్నకు బాలు సమాధానం చెబుతూ నాకు ఫాన్స్ ఉన్నారు కాబట్టే ఉప్పల్ బాలు అయ్యాను అంటూ సమాధానం చెప్పారు. ఏది ఏమైనా ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఉప్పల్ బాలు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆటో రాంప్రసాద్ కు ఓటు వేయొద్దు అంటూ ఈయన ప్రత్యేకంగా చెప్పడంతో వీరిద్దరి మధ్య ఉన్న విరోధం ఏంటి? ఉప్పల్ బాలు ఎందుకు అలా చెప్పారు అనే విషయాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఉప్పల్ బాలుకు ఇంస్టాగ్రామ్ లో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది తరచూ వివిధ వస్త్రధారణలో ఈయన వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
Also Read: ‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?