E-Paper
Advertisement

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?

ఇరుముడి ఊచకోత.. ఇప్పటివరకు వచ్చింది ఎంతో తెలుసా ?
Advertisement

Irumudi Box Office:గత కొంతకాలంగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ కి ఎట్టకేలకి బ్లాక్ బస్టర్ అందించాడు శివ నిర్వాణ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఇరుముడి సినిమా రవితేజని మరో మెట్టెక్కించింది. అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ లో మంచి ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా ఇంకా సాలిడ్ గా దూసుకుపోతుండడం విశేషం.

ఇక ఈ రోజుకి 19వ రోజుకి చేరిన ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడ డ్రాప్ కాకుండా కంటిన్యూ అవుతుండడం మరో విశేషం .ఇక 19వ రోజుకు చేరిన ఈ సినిమా కలెక్షన్స్ ఒకసారి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు ఒక కోటి 50 కోట్ల షేర్ కొలగొట్టినట్టు తెలుస్తుంది .

Advertisement

రెండు కోట్ల 60 లక్షల గ్రాస్

ఇక వరల్డ్ వైడ్ గా ఒక కోటి 60 లక్షల షేర్ తో పాటు రెండు కోట్ల 60 లక్షల గ్రాస్ ని అందుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా మూడో వారంలో కూడా ఈ సినిమా ఇలాంటి నెంబర్స్ ని రాబట్టడం అంటే సినిమా ఆడియన్స్ ని ఎంతలా అలరించిందో అర్థమవుతుంది.

Advertisement

ముఖ్యంగా వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్.ఇక 19 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమా ఇప్పటివరకు 57 కోట్ల షేర్ తో సాలిడ్ వసూళ్ళని సొంతం చేసుకుంది.

దాదాపుగా 119 కోట్ల షేర్

ఇక సీడెడ్ లో 20 కోట్లు, ఉత్తరాంధ్రలో 15 కోట్లు, వెస్ట్ లో ఐదు కోట్లు, గుంటూరులో ఏడు కోట్లు,కృష్ణాలో 6 కోట్లు, నెల్లూరులో నాలుగు కోట్ల షేర్ రాబట్టినట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి .ఏపీ, తెలంగాణ కలిపి 19 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 119 కోట్ల షేర్ ను సాధించిందని సమాచారం.

గ్రాస్ పరంగా చూస్తే ఈ సినిమా దాదాపు 156 కోట్లని చేరుకుందని వినిపిస్తుంది.ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్లలో కూడా దాదాపు ఈ సినిమాకి 10 కోట్లకు పైగా షేర్ వచ్చినట్టు సమాచారం.

దాదాపు 230 కోట్ల పైగానే

అన్నిటికన్నా మించి ఓవర్సీస్ లో ఈ సినిమా దాదాపు పది కోట్లకి పైగా కొల్లగొట్టడం చూస్తుంటే ఈ సినిమాని అక్కడి జనాలు ఇంతలా ఆదరించారో అర్ధమవుతుంది. ఇక అన్ని ప్రాంతాలను కలుపుకొని 19 రోజుల్లో ఇరుముడి సినిమా దాదాపు 139 కోట్ల షేర్ ని రాబడినట్లు సమాచారం.గ్రాస్ పరంగా చూస్తే ఈ సినిమా దాదాపు 230 కోట్ల పైగానే ఉన్నట్లు అంచనాలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు .

మొత్తానికి ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న సాలిడ్ బ్లాక్ బస్టర్ ని ఇరుముడి సినిమా రవితేజకి అందించిందని చెప్పాలి.ఇక ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ చూస్తే 20 కోట్ల టార్గెట్ ని ఎప్పుడు రీచ్ కాగా ఆ పైన వచ్చిందంతా సినిమాకి లాభమే అన్నమాట .

దాదాపు 160 కోట్ల లాభాలు

మొత్తానికి ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 160 కోట్ల లాభాలను చూసినట్టు సమాచారం.ఏది ఏమైనా ఇరుముడికి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడానికి ప్రధానంగా స్టోరీ అనే చెప్పాలి.

శివనిర్వాణ డిజైన్ చేసిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది.ముఖ్యంగా రవితేజ క్యారెక్టరైజేషన్ , నక్షత్ర పర్ఫామెన్స్ ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ .మరోవైపు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఇప్పటికీ ఇరుముడి తన స్క్రీన్ ని ఇంకా హోల్డ్ చేసి ఉండడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ సినిమా 250 కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదు.

ALSO READ:ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?

చూడాలి థియేటర్ రన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంకా ఎన్ని నెంబర్స్ ని వెనకేస్తుందో !

Tags

Related News

ఫైనల్లీ వైష్ణవి చైతన్యతో రిలేషన్ పై ఆనంద్ క్లారిటీ.. అన్న వదిననే ఫాలో అవుతున్నాడుగా?

‘సీన్ ‘గా సూర్య కొత్త సినిమా టైటిల్ .. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

వినాయక్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్.. 18న థియేటర్లలోకి ‘కళ్యాణం కమనీయం జీవితం’

వెంకీ సినిమా విషయంలో మరో ట్విస్ట్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

బేబీ బంప్ తో ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ పై సామ్..సిద్ధంగా ఉన్నానంటూ!

‘దాదా’ మూడ్ లో 80’స్ లోకి వెళ్ళిన బాలయ్య.. న్యూ గెటప్ అదుర్స్ మావా!

Big Stories

Advertisement
×