E-Paper
Advertisement

KCR : పదేండ్లు ఆయన చెప్పిందే వేదం.. ఇప్పుడు జీరో అయ్యారా?

KCR : పదేండ్లు ఆయన చెప్పిందే వేదం.. ఇప్పుడు జీరో అయ్యారా?
Advertisement

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నేత కేసీఆర్. ఆయన లేవనెత్తిన ప్రత్యేక తెలంగాణ మన హక్కు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కోట్లాది గొంతుకలను ఏకం చేశారు.ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక ఉద్యమ నేత రాష్ట్రానికి పాలకుడుగా ఉండాలని ప్రజలు ఆయన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. ఒకసారి కాదు ఏకంగా రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలి టర్ములో తనదైన పాలన, నిర్ణయాలు, సంక్షేమంతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న గులాబీ బాస్‌.. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రజలు మరోసారి అఖండ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు.ఇలా కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడితే రెండో టర్ములో ఆయన వ్యవహారశైలి, నియంత పోకడ, పార్టీ నేతల అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాల వలన ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు.

కేసీఆర్ మాటంటే శాసనం..

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాల మాటలను అస్సలు లెక్కచేసేవారు కాదు.తొలి టర్ములో ప్రతిపక్షాల సలహాలు, సూచనలు కోరిన ఆయన.. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా నియంత స్టైల్లో పాలనను సాగించారని విమర్శలొచ్చాయి. ఉద్యమకారులను పట్టించుకోకుండా, ప్రత్యేక తెలంగాణ వద్దన్న వారిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు. దీనికి తోడు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు పెద్దపీట వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా, ఇతర అభివృద్ధి పనుల్లోనూ వారికే తొలి ప్రాధాన్యం ఇచ్చారనే అపవాదును మూటగట్టుకున్నారు. అప్పుడు ఆయన మాటకు ఎదురుచెప్పే ధైర్యం చేయలేక కొందరు.. ప్రతిఘటించిన కొందరు ఏకంగా పార్టీకి దూరమయ్యారు.

ఓవర్ కాన్ఫిడెన్స్.. కేంద్రంతో ఢీ..

Advertisement

రెండోసారి ప్రజలు అధికారమిచ్చాక కేసీఆర్ కళ్లు భూమి మీద లేవని పలువురు బహిరంగంగానే విమర్శించారు. ఆయనతో పాటు తెలంగాణ కోసం కొట్లాడిన వారిని కాదని ఉద్యమ ద్రోహులకు ఉన్నత పదవులు కట్టబెట్టడంతో ఉద్యమకారులతో పార్టీకి గ్యాప్ వచ్చింది. దీనికి తోడు ఆయన కుటుంబానికే ప్రాధాన్యత పోస్టులు దక్కాయి. కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావు, కవిత ఇలా వీరికే ఉన్నత పదవులు ఇచ్చారు. దీంతో కేసీఆర్‌ది కుటుంబ పాలన అని.. వారంతా రాష్ట్రాన్ని దోచుకోవడం మొదలెట్టారని ప్రతిపక్షాలు పెద్దఎత్తున విమర్శించాయి. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారికి ప్రాధన్యత ఇవ్వకపోవడంతో వారు సైతం పార్టీని వీడారు. రాష్ట్రంలో ఉన్న పంచాయితీలు సరిపోవు అన్నట్టు కేంద్రంలోని మోడీ సర్కారుతో పెట్టుకున్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్త బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలను షేక్ చేస్తానని ప్రకటించారు. దేశమంతా తిరుగుతూ కీలక రాష్ట్రాల నేతల మద్దతు కూడగట్టేందుకు తిరిగారు.

Kavitha : ఏ ఒక్కరినీ వదలను.. కవిత తొలి రీవెంజ్ వారిమీదేనా?

Advertisement

ఓవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు, గ్రామస్థాయిలో సర్పంచులకు బిల్లుల పెండింగ్, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం, విద్యుత్ బకాయిలు, స్కాలర్ షిప్ బకాయిలు, దళితబంధు, బీసీ బంధుల పేరిట కొందరికే లబ్దిచేకూర్చడం, బీఆర్ఎస్ నేతల అవినీతి, కబ్జాలు, పేదలపై దాడులు చేయడంపై రగిలిపోయిన ఓటర్లు తమకున్న ఓటు అనే ఆయుధం ద్వారా గులాబీ బాస్‌ను గద్దె దించారు. పదేండ్ల పాటు ఏకచత్రాధిపతిగా ఓ వెలుగువెలిగిన కేసీఆర్ ప్రస్తుతం అధికారం కోల్పోయి జీరో అయ్యారని.. కుటుంబ పంచాయితీలతో సతమతం అవుతూ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని టాక్ వినిపిస్తున్నది. ప్రతిపక్ష నేత అనే హోదా ఉన్నా దానికి సరైన న్యాయం చేయడం లేదని విమర్శలొస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా ఫాంహౌస్‌కే పరిమితం కావడం ఏంటని జనం సైతం ఆయన తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. కాలం ఎంతటివారినైనా కిందపడేస్తుంది.. అందుకే ఆకాశంలో కాదు నేలమీదే నడవాలనే సామెత కేసీఆర్‌కు సరిగ్గా సరిపోతుందని అధికార పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీని వీడిన ఉద్యమకారులు పేర్కొంటున్నారు.

 

 

 

 

 

 

 

 

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×