E-Paper
Advertisement

Sravanthi Chokarapu: ఇండస్ట్రీలోకి రాకముందు యాంకర్ స్రవంతి ఏం చేసేదో తెలుసా?

Sravanthi Chokarapu: ఇండస్ట్రీలోకి రాకముందు యాంకర్ స్రవంతి ఏం చేసేదో తెలుసా?
Advertisement

Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటిగా వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇటీవల సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హే బలవంత్ (Hey Balwanth)సినిమాలో నటిగా నటించిన సంగతి తెలిసిందే .ఇందులో వెన్నెల కిషోర్ భార్యగా తన నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. మొదటి సినిమాతోనే తన నటనతో స్రవంతి ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో స్రవంతి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే తన కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారంటే

Advertisement

స్రవంతి యాంకర్ గా అందరికీ సుపరిచితమే అయితే ఈమె యూట్యూబర్ గా, రివ్యూ గా కూడా పనిచేశారు. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న స్రవంతి ప్రస్తుతం సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఎన్నో సినిమాలకు యాంకర్ గా వ్యవహరించిన స్రవంతి ఏకంగా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చారు.

గోల్డ్ షాప్ లో పనిచేసిన స్రవంతి

Advertisement

ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు గోల్డ్ షాప్ (Gold shop)లో పనిచేసేవారని తెలియజేశారు. ఇలా గోల్డ్ షాప్ లో పనిచేస్తూ ఇప్పుడు గోల్డ్ షాప్ లను ప్రమోట్ చేసే స్థాయికి స్రవంతి చేరుకున్నారని చెప్పాలి. సినిమాలు అంటే ఎంతో ఆసక్తి ఉన్న స్రవంతి ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా హైదరాబాద్ వచ్చి సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఇలా సినిమాల కోసం ప్రయత్నిస్తున్న ఈమె యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు నటిగా తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న స్రవంతి ఒకప్పుడు గోల్డ్ షాప్ లో పని చేసే వారని తెలిసి అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

మొదటి సినిమాతోనే నటిగా సక్సెస్

ఇక ఈమె మొదటి సినిమా విషయానికి వస్తే సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన హే బలవంత్ సినిమా నటిగా స్రవంతికి మొదటి సినిమా కావటం విశేషం. ఇందులో వెన్నెల కిషోర్ భార్య పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథలో స్రవంతి పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉండటమే కాకుండా ఈమె పాత్రకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఇలా మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న స్రవంతికి తదుపరి అవకాశాలు క్యూ కడతాయి అనడంలో ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయాల్సిన పనిలేదు. మరి స్రవంతి తదుపరి ఎలాంటి సినిమా అవకాశాలను అందుకోబోతున్నారు? ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Sankranthi movies 2027: హీటెక్కిస్తున్న 2027 సంక్రాంతి సినిమాల టైటిల్స్..ఒక్కొక్కటి ఒక్కో డైమండ్!

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×