Sankranthi movies 2027: సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి. సంక్రాంతి పండుగ వస్తుందంటే చిన్న హీరో నుంచి మొదలుకొని స్టార్ హీరో సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉంటాయి. ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి. అయితే 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోయే సినిమాలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో సంక్రాంతి సినిమాల టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయించుకున్నారు.
ప్రస్తుతం 2027 సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు సెట్స్ పై కెళ్ళి షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి బరిలో రాబోతున్న సినిమాలకు సరికొత్త టైటిల్స్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. పండుగ సీజన్ టార్గెట్ చేసుకొని దర్శక నిర్మాతలు క్రేజీ టైటిల్ తో రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. మరి సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాలకు ఎలాంటి టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే విషయానికి వస్తే..
హ్యాపీ పొంగల్..
సంక్రాంతి పండుగ సందర్భంగా శర్వానంద్ శ్రీనువైట్ల కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు “హ్యాపీ పొంగల్” అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ టైటిల్ సంక్రాంతి పండుగను మరింత వినోదాత్మకంగా మార్చబోతుందని చెప్పాలి. ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది .ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చే హిట్ కొట్టడంతో వచ్చే ఏడాదికి కూడా కర్చీఫ్ వేసేసారు..
సంక్రాంతి శుభాకాంక్షలు..
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలను చవిచూస్తున్న హీరో నితిన్ 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు. నితిన్ నటించబోతున్న ఈ సినిమాకు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ పండుగ పేరుని టైటిల్ గా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు అంజి దర్శకత్వం వహిస్తున్నారు.
అదిరిపోద్ది సంక్రాంతి..
బేబీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రాజేష్ దండ ఇప్పటికే అదిరిపోద్ది సంక్రాంతి అనే టైటిల్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్లు ఎవరు అనే విషయాలు వెల్లడి కాలేదు.
పండగ బొమ్మ..
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన మరొక స్టార్ ప్రొడ్యూసర్ పండగ బొమ్మ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా పండగ ఫీల్ తీసుకురావడం కోసం సంక్రాంతి పండుగకు సంబంధించిన టైటిల్ తోనే సినిమాలు రావడం విశేషం. ఇప్పటికే ఎంతోమంది దర్శక నిర్మాతలు 2027 సంక్రాంతి బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు కానీ ఇందులో ఏ ఏ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవుతాయో వేచి చూడాలి.
Also Read: US Israel Attacks: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తృటిలో బయటపడిన ఎన్టీఆర్!