E-Paper
Advertisement

Suma -Rajeev Kanakala: పెళ్లయి 25 ఏళ్ళు… సుమ దగ్గర ఆ విషయం దాచిన రాజీవ్..

Suma -Rajeev Kanakala: పెళ్లయి 25 ఏళ్ళు… సుమ దగ్గర ఆ విషయం దాచిన రాజీవ్..
Advertisement

Suma -Rajeev Kanakala: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అని చెప్పగానే అందరికీ టక్కున సుమ కనకాల(Suma Kanakala) పేరు గుర్తుకు వస్తుంది. యాంకర్ సుమ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈమె సినిమా ఈవెంట్లు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న సుమ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈమె నటుడు రాజీవ్ కనకాలను(Rajeev Kanakala) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం జరిగి దాదాపు 25 సంవత్సరాలు అవుతోంది. ఈ వైవాహిక జీవితంలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఫోన్ పాస్ వర్డ్ కూడా తెలియదా..

ఇదిలా ఉండదా తాజాగా ఓ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా సుమ తన భర్త రాజీవ్ కనకాల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఫోన్ పాస్ వర్డ్ గురించి ప్రస్తావనకు రావడంతో ఈమె మాట్లాడుతూ.. నా ఫోన్ పాస్ వర్డ్ ఇంట్లో అందరికీ తెలుసు. ఇక నా స్టాఫ్ కొంతమందికి కూడా తెలుసు కానీ మా ఇంట్లో ఏ ఒక్కరి పాస్వర్డ్ నాకు తెలియదని తెలిపారు. చివరికి తన భర్త రాజీవ్ ఫోన్ పాస్వర్డ్(Phone Password) కూడా నాకు తెలియదని ఈమె వెల్లడించారు. సుమ ఇలా చెప్పడంతో అదేంటి ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు కదా అంటూ హీరో మాట్లాడటంతో నా మొహం ఓపెన్ గా ఉంటారు కనీసం పాస్వర్డ్ కూడా తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారంటే చూడండి అంటూ ఈ సందర్భంగా సుమా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సుమ రాజీవ్ విడాకుల వార్తలు..

Advertisement

ఇలా సుమా వ్యాఖ్యలపై అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. పెద్ద మోసమే జరిగిందక్క నీ విషయంలో అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఇంత పెద్ద సీక్రెట్ దాచి పెట్టారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సుమ రాజీవ్ కనకాల ఇద్దరు ఎంతో అన్యోన్య దంపతులనే చెప్పాలి. వీరిద్దరూ తమ 25 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోతున్నారని ఇప్పటికే వేరు వేరుగా ఉన్నారంటూ ఈ దంపతుల గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

పోలీస్ పాత్రలో సుమ..

Advertisement

ఇలా సుమా రాజీవ్ వైవాహిక జీవితం గురించి ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి ఖండిస్తూనే ఉన్నారు. ఈ దంపతులు తమ పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక సుమా కుమారుడు రోషన్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రోషన్ మోగ్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రం రోషన్ కు రెండవ సినిమా కావటం విశేషం. ఇక సుమ కూడా త్వరలోనే ప్రేమంటే(Premante) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శి, ఆనంది ఈ సినిమాలో జంటగా నటించారు.

Also Read: Anjali Pawan: చిల్డ్రన్స్ డే స్పెషల్.. కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి.. ఫోటో వైరల్!

Related News

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

Big Stories

Advertisement
×