E-Paper
Advertisement

Vaibhav Suryavanshi: వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ,20 ఓవ‌ర్ల‌లో 297 ప‌రుగులు, SRH రికార్డ్ బ‌ద్ద‌లు

Vaibhav Suryavanshi: వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ,20 ఓవ‌ర్ల‌లో 297 ప‌రుగులు, SRH రికార్డ్ బ‌ద్ద‌లు

Vaibhav Suryavanshi: టీమిండియా యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) మరోసారి రెచ్చిపోయాడు. అటాకింగ్ బ్యాటింగ్ తో ఎప్పుడు దుమ్ము లేపే వైభవ్ సూర్యవంశీ, తాజాగా సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసి, ఊచకోత కోశాడు. మెన్స్ ఏషియా కప్ రైసింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో ( ACC Mens Asia Cup Rising Stars 2025) పసిక్యూన యూఏఈ A జట్టుపై ( United Arab Emirates ) టీమిండియా A త‌ర‌ఫున బరిలోకి దిగి తన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు వైభవ్ సూర్యవంశీ. 32 బంతుల్లోనే సెంచ‌రీ చేసి, 342 స్ట్రైక్ రేట్ తో ర‌ఫాడించాడు. దీంతో యూఏఈ A జ‌ట్టుపై భారీ స్కోర్ సాధించింది టీమిండియా. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు న‌ష్ట‌పోయి 297 ప‌రుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 298 ప‌రుగులు చేస్తే యూఏఈ విజ‌యం సాధిస్తుంది.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

20 ఓవ‌ర్ల‌లో 297 ప‌రుగులు, SRH రికార్డ్ బ‌ద్ద‌లు

టీమిండియా వర్సెస్ యునైటెడ్ జ‌ట్ల ( India A vs United Arab Emirates) మధ్య ఏషియన్ మెన్స్ రైసింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ( India A ) అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 297 పరుగులు సాధించింది. అయితే టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో డేంజర్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సెంచరీతో దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్లో 42 బంతుల్లోనే 144 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ. ఇందులో 15 సిక్సర్లతో పాటు 11 బౌండరీలు ఉన్నాయి. 342.86 స్ట్రైక్ రేటుతో రఫ్పాడించాడు. మరో ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

నమంధీర్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇక టీమ్ ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న జితేష్ శర్మ 32 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లతో పాటు 8 బౌండరీలు ఉన్నాయి. ఈ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన టీమిండియా 297 పరుగులు చేసింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్ సాధించిన 287 మార్కును తాజాగా టీమిండియా A జట్టు బీట్ చేసింది. 2024 ఐపీఎల్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై మూడు వికెట్లు నష్టపోయిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా A జ‌ట్టు బద్దలు కొట్టింది.

ఒకే గ్రూప్ లో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా

ఏసీసీ మెన్స్ ఏసియా రైసింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ లో 8 జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. గ్రూపు ఏ లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే హాంకాంగ్ ఉన్నాయి. అటు గ్రూప్ బీలో పాకిస్తాన్, టీమిండియా, యూఏఈ, ఒమన్ దేశాలు పాల్గొంటున్నాయి. ఈ టోర్న‌మెంట్ లో జ‌రిగే ప్ర‌తీ మ్యాచ్ ను దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా నిర్వ‌హిస్తున్నారు.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×