E-Paper
Advertisement

Sandeep Master: ఆట సందీప్ కి చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. ఇంటికి పిలిచి మరి..

Sandeep Master: ఆట సందీప్ కి చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. ఇంటికి పిలిచి మరి..
Advertisement

Aata Sandeep Meets Chiranjeevi: సందీప్ మాస్టర్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. సందీప్ మాస్టర్ గా కంటే ఆట సందీప్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రముఖ ఛానల్లో వచ్చిన ఆట డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ గా తన డ్యాన్స్ తో అదరగొట్టాడు. తొలి సీజన లోనే విన్నర్ గా నిలిచాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫీ చేసిన సందీప్ ప్రస్తుతం సొంతంగా స్టూడియో పెట్టి ఎంతోమందికి డ్యాన్స్ శిక్షణ ఇస్తున్నాడు. అంతేకాదు పలు షోలో, ఈ వెంట్స్ లో తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్

Advertisement

అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ వచ్చాడు. టాప్ 5 కంటెస్టెంట్ ఉండాల్సిన ఆయన అనుకోకుండ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అప్పట్లో ఆట సందీప్ ఎలిమినేషన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో తన భార్య జ్యోతిరాజ్ తో కలిసి ట్రేండి పాటలు డ్యాన్స్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంటాడు. అలా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సందీప్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. తన భార్య జ్యోతిరాజ్ తో కిలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు.

ఆ దేవుడే వచ్చి వరం ఇచ్చినట్టుంది

‘నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు! స్వయంగా ఆ దేవుడు మెగాస్టార్ చిరంజీవిలా దిగివచ్చి మాకు వరం ఇచ్చినట్టుగా అనిపించింది. ఎన్నో ఏళ్లుగా నేను నమ్ముకున్న నా డాన్స్‌, నా కష్టాన్ని చూసి.. అయనే స్వయంగా నన్ను ఇంటికి పిలిచి.. నాకు కొరియోగ్రాఫీ చాన్స్ ఇచ్చారు. ఆయన నుంచి ఈ మాట విన్న ఆ క్షణం నాకు సాక్షాత్ పరమశివుడు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా అనిపించింది. అది పూర్తిగా దైవానుగ్రహం లాంటి అనుభూతి… హృదయం మొత్తం ఆనందంతో నిండిపోయింది.

Advertisement

Also Read: Anchor Suma: యాంకర్ల సిండికేట్ వివాదం.. ఉదయ భాను కామెంట్స్ పై సుమ రియాక్షన్

త్వరలోనే బిగ్ న్యూస్

అందులోను మా జంట గురించి, నా వైఫ్ జ్యోతి గురించి ఆయన చెప్పిన మాటలు.. మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు… మా జీవితానికి కొత్త బలం, ముందుకు నడిపించే పెద్ద ధైర్యం ఇచ్చాయి. ఆ మాటలు మా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. చిరంజీవి గారు స్వయంగా పిలిచి ఇచ్చిన ఈ అవకాశం చిన్నప్పటి నుంచి నేను కల కలగన్న ఆ కల కళ్ల ముందుకు వచ్చింది. ఎన్నో రోజుల కల నెరవేరిన రోజు ఇది. ఆయనతో కూర్చొని మాట్లాడిన ప్రతీ క్షణం, అయన చూపిన ఆప్యాయం, వినయం, ప్రేమ అన్నీ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను సహృదయ కృతజ్ఞతలతో చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా’ త్వరలోనే బిగ్ న్యూస్ రాబోతోందంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×