Suma Kanakala: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యాంకర్ అంటే టక్కును అందరికీ సుమ కనకాల (Suma Kanakala)గుర్తుకు వస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ యాంకర్ గా క్షణం తీరిక లేకుండా వరుస సినిమా ఈవెంట్లతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు సినిమా ఈవెంట్లు చేస్తూనే మరోవైపు ఇంటర్వ్యూ బుల్లితెర కార్యక్రమాలు అలాగే సినిమాలలో కూడా నటిస్తున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సుమ తాజాగా ప్రేమంటే సినిమా(Premante Movie) వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమాలో సుమ కనకాల కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలుస్తుంది.. ఈ సినిమా నవంబర్ 21వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది ఈ కార్యక్రమంలో సుమ పాల్గొన్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ తన రిటైర్మెంట్(Retirement) గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటుంది అంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలా రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈమె స్పందించారు.. చాలామంది నా రిటైర్మెంట్ గురించి అడుగుతున్నారు.. సినిమా ఇండస్ట్రీలో మనుకు రిటైర్మెంట్ లేదని తెలిపారు.. మా ఫ్యామిలీలో అందరికీ స్ట్రాంగ్ జీన్స్ ఉన్నాయని ఇప్పటికీ మా అమ్మకు 84 సంవత్సరాలు అయినా తాను రిటైర్మెంట్ కాలేదు ఇక నేనెందుకు రిటైర్మెంట్ అవుతానని తెలిపారు.
తన అమ్మమ్మ 110 సంవత్సరాలు బ్రతికిందని, తన పెద్ద మామయ్య 99 సంవత్సరాలైనా ఇప్పటికీ అడ్వకేట్ గా కొనసాగుతూ కోర్టుకు వెళ్తున్నారని ఈ విషయంలో మా పెద్దమామయ్య గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారని సుమ తెలిపారు. ఇక మా అమ్మ 84 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలా మా ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్ జెనెటిక్స్ ఉన్నప్పుడు నేనెందుకు రిటైర్మెంట్ ప్రకటిస్తాను అంటూ సుమా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సుమ ఐదు పదుల వయసులోకి అడుగుపెడుతున్న ఇప్పటికి ఎంతో చలాకీగా ఉంటూ వరుస ఈవెంట్లను నిర్వహిస్తున్నారు.
సీరియల్ నటిగా కెరియర్ ప్రారంభం..
ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ కెరియర్ మొదట్లో నటిగా పలు సీరియల్స్ చేశారు అదేవిధంగా సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుమ యాంకర్ గా మారి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు. చిన్న సినిమాల నుంచి మొదలుకొని పెద్ద సినిమాల వరకు ఏదైనా ఒక వేడుక జరగాలి అంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో సుమ ఉండాల్సిందే. అంత అద్భుతంగా ఆ సినిమా వేడుకను విజయవంతం చేస్తారు. పలు సందర్భాలలో సుమ లేకపోతే మా సినిమా ఈవెంట్ కూడా రద్దు చేసుకున్నాం అంటూ చెప్పిన దర్శక నిర్మాతలు కూడా ఉన్నారంటే సుమ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.