E-Paper
Advertisement

Premante Movie : ‘ప్రేమంటే ‘ మూవీలో దువ్వాడ శ్రీను-మాధురి జంట..

Premante Movie : ‘ప్రేమంటే ‘ మూవీలో దువ్వాడ శ్రీను-మాధురి జంట..
Advertisement

Premante Movie : బలగం సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ప్రేమంటే.. ఈనెల 21న థియేటర్లోకి రాబోతుంది. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో సోషల్ మీడియా కాంట్రవర్సీస్ జంట దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు కూడా నటించబోతున్నట్లు ఓ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తుంది.. కేవలం గెస్ట్లుగా కాసేపు కనిపించే వెళ్తారని టాక్.. మరి వీళ్ళు ఎంతసేపు కనిపిస్తారు అన్నది తెలియాలంటే కచ్చితంగా సినిమాలో చూడాల్సిందే..

ప్రేమంటే మూవీలో దువ్వాడ శ్రీను – మాధురి..

దువ్వాడ శ్రీను – మాధురి ఈ జంట పేరు తెలియని వాళ్లు ఉండరేమో.. తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. రాజకీయాల్లో వాళ్ళిద్దరి బంధం సంచలనం అయ్యింది. అక్కడ నుంచి సోషల్ మీడియాకు వచ్చింది.. అప్పటి నుంచి ఈ జంట మీడియా కాంట్రవర్సీ జంటగా మారింది.. వీరిద్దరికీ సోషల్ మీడియాలో సినీ స్టార్ హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రీసెంట్ గా విడుదలైన ఓ సినిమాలో దువ్వాడ జంటకు ఇలాంటి ఆఫరే వచ్చింది. కానీ వాళ్లిద్దరూ ఎందుకో ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం ఓకే చేసేశారు. శ్రీనివాస్ సంగతేమో గానీ, మాధురికి మాత్రం సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని ఆశ  ఇటీవలే మాధురి బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.. హౌస్ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అదే క్రేజ్ తో ఇప్పుడు ఈ సినిమాలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ఓ వార్త అయితే నెట్టింట ప్రచారంలో ఉంది.. ప్రేమంటే సినిమాలో ఈ జంట కనిపించడంతో ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురవడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. బయట కనిపించిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి లు సినిమాల్లో ఎలా కనిపిస్తారో చూడాలి..

Advertisement

Also Read :తండ్రి మాటకు కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. శ్రీవల్లి మరో ప్లాన్..కడుపుబ్బా నవ్వించే సీన్..

ప్రేమంటే మూవీ.. 

హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా ఈ మూవీలో కనిపిస్తున్నారు. జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు.  తెలుగు ప్రముఖ యాంకర్ సుమ కనకాల, ‘వెన్నెల’ కిషోర్, ‘హైపర్’ ఆది, కిరిటీ దామరాజు, అభయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు.. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తుందని ఇటీవల విడుదలైనఇటీవల విడుదలైన ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఈ సినిమా ప్రియదర్శి ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×