E-Paper
Advertisement

Curd In Winter:వామ్మో, చలికాలంలో ఇది తింటే ప్రాబ్లమ్స్ పక్కా.. ఎందుకో తెలుసా ?

Curd In Winter:వామ్మో, చలికాలంలో ఇది తింటే ప్రాబ్లమ్స్ పక్కా.. ఎందుకో తెలుసా ?
Advertisement

Advertisement

Curd In Winter: పెరుగు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. భోజనం చివర్లో పెరుగు తినకపోతే తిన్న తృప్తి కూడా ఉండదని చాలా మంది చెబుతుంటారు. ఈ అలవాటు తరతరాలుగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పాలతో తయారు చేసే పదార్థాలు ఆరోగ్యానికి మంచివని మనందరికీ తెలిసిందే ముఖ్యంగా పాలతో తయారు చేసిన పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం, ప్రోటీన్ వంటివి అధిక మోతాదులో ఉంటాయి. ఇదిలా ఉంటే చాలా మంది చలికాలంలో పెరుగు తినాలా ? వద్దా అనే సందేహం కూడా ఉంటుంది. చలికాలంలో పెరుగు సరైన సమయంలో తినకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెబుతుంటారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో పెరుగు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:

Advertisement

1. జలుబు, దగ్గు:

చలికాలంలో పెరుగు తినడానికి ప్రధాన కారణం జలుబు, దగ్గు. సాధారణంగా పెరుగు చల్లని స్వభావాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పూట పెరుగు తినడం వల్ల కఫం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఫలితంగా జలుబు , దగ్గు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చలికాలంలో పెరుగు తరచుగా తినడం వల్ల ముక్కు కారడంతో పాటు గొంతు నొప్పి. దగ్గు వంటి లక్షణాలు కూడా తీవ్రంగా మారతాయి. అంతే కాకుండా ఫ్లూ, జలుబు లక్షణాలు ఉన్న వారు పెరుగును పూర్తిగా మానుకోవడం చాలా మంచిది.

2. సైనస్ సమస్యలు:

సైనసైటిక్ సమస్యలతో ఇబ్బంది పడే వారు చలికాలంలో పెరుగు తనకుండా ఉండటమే బెటర్. పెరుగులోని చల్లదనం కారణంగా ముక్కు భాగంలో కూడా శ్లేష్మ పొరల్లో కూడా వాపు పెరిగి, సైనస్ , తలనొప్పి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే సైనస్ సమస్యతో ఇబ్బంది పడే వారు పెరుగు తినకుండా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3. కీళ్ల నొప్పులు:

ఆర్థరైటీస్ లేదా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు చలికాలంలో పెరుగు తినకుండా ఉండటం మంచిది.యఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం పెరుగులో ఆమ్ల గుణం ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉండే శీతల స్వభావం కూడా శరీరంలో వాపును పెంచే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ వాపు కీళ్లలో పేరుకుపోయి కీళ్ల నొప్పులు పెంచే అవకాశం కూడా ఉంటుంది.

4. జీర్ణ క్రియ:

చలికాలంలో సాధారణంగానే జీర్ణక్రియ సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో రాత్రిపూట లేదా పగటిపూట పెరుగు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మరింత మందగిస్తుంది. ఇలా జీర్ణక్రియ మందగించడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా.. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు తినకుండా ఉండటం చాలా మంచిది.

5. గొంతు సమస్యలు:

గొంతు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు పెరుగు తినకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు తింటే మాత్రం ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. పెరుగులో ఉండే చల్లదనం వల్ల కూడా టాన్సిల్స్ వాచి గొంతు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే గొంతు సంబంధిత సమస్యలు ఉన్న వారు పెరుగు తినకుండా ఉంటేనే బెటర్ .

Also Read: చర్మ సమస్యలా ? అసలు కారణాలివేనట !

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

చలికాలంలో పెరుగు ప్రయోజనాలను పొందాలనుకుంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి.

సమయం: పెరుగును పగటిపూట (మధ్యాహ్నం) మాత్రమే తినాలి. సాయంత్రం 4 గంటల తర్వాత లేదా రాత్రిపూట పూర్తిగా మానుకోవాలి.

ఉష్ణోగ్రత: ఫ్రిజ్‌లో ఉంచిన పెరుగుకు బదులు, గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగును మాత్రమే తినాలి.

కలిపి తినడం: పెరుగును అల్లం, మిరియాలు లేదా మెంతి గింజలు వంటి వేడి స్వభావం ఉండే పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల దాని చల్లదనం ప్రభావం తగ్గుతుంది.

మసాలా మజ్జిగ: మజ్జిగ రూపంలో (పెరుగు కంటే తక్కువ చిక్కగా), మసాలాలు కలిపి తీసుకోవడం ఉత్తమం.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×