Akhanda 2 Event: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వరుస సక్సెస్ఫుల్ సినిమాలతో కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే ఇదే బాలకృష్ణకు ఒకప్పుడు వరుసగా డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. ఒక తరుణంలో బాలకృష్ణ మీద చాలామంది విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు.
ఎక్కువగా బాలకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారేవి. ఒక సందర్భంలో మహిళల గురించి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఏకంగా అసెంబ్లీ వరకు వెళ్లిపోయాయి. అసెంబ్లీలో చాలామంది వీటినే చూపిస్తూ బాలకృష్ణను తగ్గించి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఒకవైపు రాజకీయ నాయకుడిగా, మరోవైపు సినీ నటుడిగా అద్భుతమైన జర్నీ కొనసాగుతున్న తరుణంలో బాలకృష్ణ చేసిన కొన్ని పనుల వలన, అలానే మాట్లాడిన మాటలు వలన అతని గురించి చాలామంది నెగిటివ్ గా చెబుతూ ఉంటారు.
బాలకృష్ణ ప్రతి ఫంక్షన్ లో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు. అతను చేసే కొన్ని పనులు విచిత్రంగా ఉంటాయి. తన చేతిలో ఉన్న మొబైల్స్ విసిరేయటం. మైకును గాలిలో వేసే క్యాచ్ పట్టడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సరిగ్గా క్యాచ్ పెడితే బానే ఉంటుంది కానీ అవి గాని మిస్ అయ్యాయి అంటే ఇంకొకరి ప్రమాదం జరగటం ఖాయం.
అఖండ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక ఈవెంట్ పెట్టారు. ఈ ఈవెంట్లో బాలయ్య మాట్లాడిన తర్వాత మైక్ ను గాలిలో ఇస్తారు. వెంటనే పక్కనున్న నిర్మాత రామ్ ఆచంట, అలానే యాంకర్ ఉదయభాను ఇద్దరూ కూడా విపరీతంగా భయపడిపోయారు. వాళ్లలో ఎవరికో ఒకరికి తగలాల్సింది జస్ట్ మిస్ అయిపోయింది. ఆ షాకింగ్ రియాక్షన్స్ ఈవెంట్లో గమనించొచ్చు.
బాలకృష్ణను చాలామంది చూసే విధానం అనేది అన్ స్టాపబుల్ అనే రియాలిటీ షో తో మారిపోయింది. చాలామంది గెస్ట్ లతో బాలకృష్ణ మాట్లాడే విధానం. అలానే చాలామంది కి ఫోన్ చేసి వాళ్లతో కాల్ మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తే బాలకృష్ణ అసలైన ఒరిజినాలిటీ ఏంటో చాలామందికి అర్థమైంది.
గతంలో పూరి జగన్నాథ్ కూడా మాట్లాడుతూ బాలకృష్ణ మంచి మనసు గురించి పలు సందర్భాలలో చెప్పారు. అభిమానులను బాలయ్య కొడతారు అంటారు అసలు అభిమానులను కొట్టడానికి అసలు కారణం ఏంటంటే అని పూరి ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ రివిల్ చేశారు. అన్ స్టాపబుల్ షో చేసిన తర్వాతే బాలకృష్ణ పైన గౌరవం కూడా చాలామందికి విపరీతంగా పెరిగిపోయింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ అందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ బాలకృష్ణ కు ఉంది. విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలతో బాలయ్య బాబుకు ఉన్న రిలేషన్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Also Read: Akhanda 2 Event: రచ్చ రవి నన్ను కింద కూర్చోమంటావా? నిన్ను ఎవడయ్య కూర్చోమంది.?