E-Paper
Advertisement

Akhanda 2 Event: రచ్చ రవి నన్ను కింద కూర్చోమంటావా? నిన్ను ఎవడయ్య కూర్చోమంది.?

Akhanda 2 Event: రచ్చ రవి నన్ను కింద కూర్చోమంటావా? నిన్ను ఎవడయ్య కూర్చోమంది.?
Advertisement

Akhanda 2 Event: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ పైన విపరీతమైన నమ్మకాలు ఉంటుంటాయి. అటువంటి కాంబినేషన్ లో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ ఒకటి. సింహ సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్ ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా కొనసాగింది. రిలీజ్ అయిన మూడు సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అందుకే నాలుగో సినిమా అయినా అఖండ 2 మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. మొదటిసారి పాన్ ఇండియా స్థాయి సినిమా బాలకృష్ణ కెరియర్ లో విడుదలవుతుంది కాబట్టి. ముంబై నుంచి బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ వంటి వివిధ ప్రాంతాల్లో ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ నేడు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. రచ్చ రవికి వార్నింగ్ ఇచ్చారు బాలయ్య.

రచ్చ రవి నన్ను కింద కూర్చోమంటావా?

Advertisement

సాధారణంగా కొన్ని సినిమా ఈవెంట్స్ కు సంబంధించి చిత్ర యూనిట్ టెక్నీషియన్స్ అందరూ కలిసి ఫోటో దిగడం అనేది కామన్ గా జరుగుతుంది. ఈ తరుణంలోనే అఖండ చిత్ర యూనిట్ అంతా కూడా బాలకృష్ణతో వేదిక పైన ఫోటో దిగారు.

ఫోటో దిగుతున్న తరుణంలో మనిద్దరం ఫోటో దిగుతాం ఒకసారి కూర్చోండి అని రిక్వెస్ట్ చేశాడు రచ్చ రవి. అయితే బాలకృష్ణ కూర్చున్న తర్వాత రచ్చ రవి నిలుచునే ప్రయత్నం చేశాడు. దీని గురించి బాలయ్య స్టేజ్ పైన మాట్లాడుతూ రవికి వార్నింగ్ ఇచ్చారు. రచ్చ రవి ఫోటో దిగడం కోసం నన్ను కూర్చోమంటావా. నేను కూర్చున్న తర్వాత నువ్వు నిలుచుంటావా అంటూ స్టేజ్ మీద అడిగారు.

Advertisement

ఒకవైపు నవ్వుతూ నమస్కారం పెడుతూ కింద నుంచి రియాక్ట్ అయ్యాడు రచ్చ రవి. అతనికి రెండు మూడుసార్లు రచ్చ రవిని కూర్చోబెట్టి నిల్చబెట్టి తర్వాత సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు అందరి గురించి బాలకృష్ణ మాట్లాడారు.

రచ్చ రవి భజన 

మామూలుగా ఏదైనా ఈవెంట్ జరిగితే రచ్చ రవి ఏ స్థాయిలో రచ్చ చేస్తాడు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో కూడా గట్టిగట్టుగా అరుస్తూ మాట్లాడటం వల్లనే రవికి రచ్చ రవి అనే పేరు వచ్చింది. ప్రతి ఈవెంట్ లో కూడా హీరోలను విపరీతంగా పొగుడుతూ ఉంటాడు.

ఇక అఖండ ఈవెంట్ లో కూడా ఒక వైపు సినిమాలు పరంగా మరోవైపు రాజకీయపరంగా బాలకృష్ణను ఆకాశాన్ని ఎత్తేశాడు. బహుశా ఆ విషయం బాలకృష్ణకు కూడా అర్థమై ఉండడం బట్టే మరీ ఓవర్ గా రియాక్ట్ అవకుండా షటిల్డ్ గా థాంక్యూ అన్నట్లు చెప్పారు బాలయ్య.

Also Read: Akhanda 2 Event : పెళ్లయిన తర్వాత బాడీలో మార్పులు సహజం, నటి పూర్ణాపై బోయపాటి ఆసక్తికర కామెంట్స్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×